Kim Jong un: వరదలను అడ్డుకోలేదని.. 30 మందికి మరణశిక్ష!
ABN , Publish Date - Sep 05 , 2024 | 05:42 AM
ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాలో.. ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ 30 మంది అధికారులకు మరణ శిక్ష విధించారు.
ప్యాంగ్యాంగ్, సెప్టెంబరు 4: ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఉత్తర కొరియాలో.. ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ 30 మంది అధికారులకు మరణ శిక్ష విధించారు. కారణమేంటంటే..? వారు వరదలను అడ్డుకోలేకపోవడమేనట..! విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఆ 30 మందికి మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు పలు అంతర్జాతీయ వార్తాసంస్థలు కథనాలను ప్రసారం చేశాయి.
అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం పేరుతో గత నెల 20-30 మంది అధికారులకు కిమ్ మరణశిక్ష విధించారని తొలుత దక్షిణ కొరియాకు చెందిన ‘చోసన్ టీవీ’లో ఓ కథనం ప్రసారమైంది. ఆ తర్వాత కొద్దిరోజులకే వీరికి మరణశిక్షను అమలు చేసినట్లు మరో కథనం పేర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో ఉత్తర కొరియాలో భారీ వర్షాలతో 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.