Share News

PM Modi: మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

ABN , Publish Date - Jul 09 , 2024 | 09:02 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'ను మంగళవారంనాడు అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు.

PM Modi: మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం

మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్' (Order of St Andrew the Apostle)ను మంగళవారంనాడు అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో చేసిన విశేష సేవకు గుర్తింపుగా 2019లో మోదీకి అవార్డును ప్రకటించారు. ఇప్పుడు మోదీ స్వయంగా దీనిని అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయ నేత కూడా మోదీనే కావడం విశేషం.

Modi visits Atom Centre: పుతిన్‌తో అణుకేంద్రాన్ని సందర్శించిన మోదీ


ఇరుదేశాల మధ్య మైత్రీబంధం పటిష్టతకు, పరస్పర అవగాహన పెంపొందేందుకు మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అవార్డు ప్రధానం సందర్భంగా మోదీని పుతిన్ అభినందించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారం అందుకుంటున్న తరుణంలో హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని, చిరకాల ఆరోగ్యం, విజయాలు చేకూరాలని ఆశిస్తు్న్నామని పేర్కొన్నారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించడం గౌరవంగా ఉందని, దీనిని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నానని మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 09 , 2024 | 09:06 PM