Share News

Plane Missing: ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఫ్లైట్ మిస్సింగ్..కొనసాగుతున్న గాలింపు చర్యలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:19 AM

తూర్పు ఆఫ్రికా దేశం మలావి(Malawi)లో ప్రముఖ నేతలతో కూడిన సైనిక విమానం(flight) ఆకాశం నుంచి సోమవారం అదృశ్యమైంది(missing). విమానంలో వైస్ ప్రెసిడెంట్(Vice President) సౌలోస్ చిలిమా(51)తో(Saulos Chilima) సహా 10 మంది ఉన్నారని ఇక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Plane Missing: ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న ఫ్లైట్ మిస్సింగ్..కొనసాగుతున్న గాలింపు చర్యలు
Malawi Vice President Saulos plance missing

తూర్పు ఆఫ్రికా దేశం మలావి(Malawi)లో ప్రముఖ నేతలతో కూడిన సైనిక విమానం(flight) ఆకాశం నుంచి సోమవారం అదృశ్యమైంది(missing). విమానంలో వైస్ ప్రెసిడెంట్(Vice President) సౌలోస్ చిలిమా(51)తో(Saulos Chilima) సహా 10 మంది ఉన్నారని ఇక్కడి ప్రభుత్వ అధికారులు తెలిపారు. విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, దాని ఖచ్చితమైన స్థానం ఇంకా అందుబాటులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మలావి ప్రభుత్వం రాడార్ నుంచి విమానం అదృశ్యమైనట్లు నివేదించింది.


సమాచారం తెలుసుకున్న విమానయాన అధికారులు(officers) అదృశ్యమైనప్పటి నుంచి దానిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలుస్తోంది. అక్కడి మీడియా నివేదికల ప్రకారం విమానం(Plane) దాని గమ్యస్థానమైన Mzuzu వద్ద ల్యాండ్ చేయడంలో విఫలమైందని సమాచారం. Mzuzu మలావి ఉత్తర ప్రాంతంలో ఉంది. ఈ నేపథ్యంలో విమానం ఆచూకీ కోసం తక్షణమే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించాలని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా బహామాస్ పర్యటనను రద్దు చేసుకుని ప్రాంతీయ, జాతీయ దళాలను ఆదేశించారు. ప్రస్తుతం విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.


మరోవైపు మే 19న జరిగిన హెలికాప్టర్(helicopter) ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63), విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ మరణించారు. అజర్‌బైజాన్‌ నుంచి తిరిగి వస్తుండగా ఆయన హెలికాప్టర్‌ అదృశ్యమైంది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని మొత్తం 9 మంది చనిపోయారు.


ఇది కూడా చదవండి:

Prime Minister Modi : మరో 3 కోట్ల ఇళ్లు


SEBI : మరింత కట్టుదిట్టంగా డెరివేటివ్స్‌ మార్కెట్‌

iPhones : ఐఫోన్లకూ జనరేటివ్‌ ఏఐ టెక్నాలజీ హంగులు

Read Latest International News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 07:23 AM