Share News

పుంజుకుంటున్న ట్రంప్‌!

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:58 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పాలక డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నడుమ హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. పలు సర్వే సంస్థలు నిన్నమొన్నటి వరకు

పుంజుకుంటున్న ట్రంప్‌!

కమలా హ్యారిస్‌ శిబిరంలో కలవరం

పోరు రసవత్తరం.. తేడా 2 శాతమే

అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తాజా సర్వేల్లో వెల్లడి

కీలక ‘స్వింగ్‌’ రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షుడి ముందంజ

హ్యారిస్‌ను భయపెడుతున్న హరికేన్లు, యుద్ధం

ఇజ్రాయెల్‌కు మద్దతివ్వడంపై అరబ్‌ ఓటర్లలో ఆగ్రహం

ట్రంప్‌ ఆర్థిక విధానాలపై ఆర్థికవేత్తల ఆందోళన

దిగుమతి సుంకాల పెంపు యోచనపై ధ్వజం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పాలక డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నడుమ హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. పలు సర్వే సంస్థలు నిన్నమొన్నటి వరకు హ్యారిస్‌ విజయం ఖాయమని అంచనా వేశాయి. తాజాగా ట్రంప్‌ బాగా పుంజుకుంటున్నట్లు పేర్కొన్నాయి. గత పది రోజుల్లో తాము నిర్వహించిన సర్వేల సగటు చూస్తే దేశవ్యాప్తంగా హ్యారిస్‌ ఆధిక్యం నాలుగు శాతం నుంచి రెండు శాతానికి తగ్గిపోయినట్లు ‘ది గార్డియన్‌’ పత్రిక ఆదివారం వెల్లడించింది. నువ్వా నేనా అనే రీతిలో పోరు జరిగే 19 కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ ముందంజలో ఉండడం హ్యారిస్‌ శిబిరాన్ని కలవరపరుస్తోంది. ఆయన దూకుడును అడ్డుకునే దిశగా ప్రచార వ్యూహం రచిస్తోంది. ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ట్రంప్‌ ముందంజలోకి రావడానికి కారణంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెలలో అమెరికాలో సంభవించిన రెండు విధ్వంసక హరికేన్లు (మిల్టన్‌, హెలెన్‌), పశ్చిమాసియా సంక్షోభం పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం మొదలైనవి హ్యారిస్‌ ఆధిక్యం తగ్గడానికి ప్రధాన కారణాలుగా ‘గార్డియన్‌’ పేర్కొంది. రెండు వారాల కిందట ఆమె వైపు 48% మంది అమెరికన్లు మొగ్గు చూపగా.. ట్రంప్‌ 44% మంది మద్దతు పొందారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఆమె ఆధిక్యం 46 శాతానికి తగ్గిపోయింది. అంటే ప్రస్తుతం ఇద్దరి మధ్య రెండు శాతం తేడా మాత్రమే ఉండడం డెమోక్రాట్లను విస్మయపరుస్తోంది. పెన్సిల్వేనియా, మిచిగన్‌, విస్కోన్సిన్‌, నార్త్‌ కరోలినా, జార్జియా, అరిజోనా, నెవడా.. ఈ ఏడు రాష్ట్రాలు అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయిస్తాయని చెబుతారు. వీటిలో 3 రాష్ట్రాల్లో మాత్రమే హ్యారిస్‌ వైపు మొగ్గు కనిపిస్తోంది. వీటిలోనూ పెన్సిల్వేనియాలో ట్రంప్‌ కంటే ఒక శాతమే ఆమె ముందంజలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ట్రంప్‌కు స్వల్ప ఆధిక్యం కనిపిస్తోంది. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ నాడు ఇదే పరిస్థితి కొనసాగితే.. విజయానికి కావలసిన 270 ఎలక్టొరల్‌ కాలేజీ ఓట్లను ట్రంప్‌ సునాయాసంగా దక్కించుకుని.. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని ‘గార్డియన్‌’ అంచనా వేసింది. గత నెల పదోతేదీ నాటికి.. అన్ని సర్వేల డేటాలను అధ్యయనం చేస్తే నూటికి 55% హ్యారిస్సే గెలుస్తారని ఫలితాలు చెబుతున్నాయని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని తెలిపింది. అయితే ఇప్పుడున్న ట్రెండ్‌ పోలింగ్‌ తేదీన కూడా కొనసాగితే అరిజోనా, మిచిగన్‌, విస్కోన్సిన్‌, జార్జియాల్లో ఆమెకు స్వల్ప ఆధిక్యం మాత్రమే లభిస్తుందని.. బొటాబొటీగా నెగ్గడానికి ఇది దోహడపడుతుందని 11వ తేదీన ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ సర్వే వెల్లడించింది. ఈ నెల 3-8 తేదీల నడుమ ‘యాక్టివోట్‌’ నిర్వహించిన సర్వేలో హ్యారిస్‌ కంటే ట్రంప్‌ 1.2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది.'

.


తక్కువ మార్జిన్‌తో తంటా..

హ్యారిస్‌ ప్రజాదరణ శాతం క్రమంగా తగ్గుతుండడంతో ఉపాధ్యక్షురాలి శిబిరానికి ఏమీ పాలుపోవడం లేదు. జూలైలో కమలను డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థినిగా ప్రకటించాక.. ఆ పార్టీకి విరాళాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. గత 80 రోజుల్లో ఆమె ప్రచార బృందం బిలియన్‌ డాలర్ల విరాళాలు సేకరించింది. అయితే ట్రంప్‌ టీమ్‌ తక్కువ తినలేదు. ఆగస్టు నెలాఖరునాటికి 3 బిలియన్‌ డాలర్లకుపైగా సాధించింది. మరోవైపు పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌ ఆర్థికంగా అండగా నిలవడమే గాక కీలక ‘స్వింగ్‌’ రాష్ట్రాల్లో ట్రంప్‌ అనుకూల ఓటర్లుగా రిజస్టర్‌ చేసుకునేవారికి నగదు కూడా ఇస్తున్నారు. గత నెల పదో తేదీన ఫిలడెల్ఫియాలో ట్రంప్‌తో జరిగిన చర్చలో హ్యారిస్‌ విజేతగా నిలిచారు. కానీ మిచిగన్‌, విస్కోన్సిన్‌, పెన్సిల్వేనియాల్లో క్రమంగా ఆమె ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. అయితే హ్యారిస్‌ కూడా ఓటర్ల మద్దతు కోసం పెద్దఎత్తున కృషిచేస్తున్నారు. సబర్బన్‌ ఓటర్లు, మధ్య ఆదాయ వర్గాలే లక్ష్యంగా వరాలు ప్రకటిస్తున్నారు. చౌకగా వైద్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆర్థిక పారదర్శకత వంటి హామీలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సబర్బన్‌ ఓటర్లలో 47ు మంది ఆమె వైపు మొగ్గుచూపుతున్నారని.. 41ు మంది మాత్రమే ట్రంప్‌ వైపు నిలిచారని ‘రాయిటర్స్‌/ఇప్సోస్‌’ సర్వే వెల్లడించింది. 2020 ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమికి సబర్బన్‌ ఓటర్లే కారణం కావడం విశేషం.

యుద్ధభయం..

నవంబరు 5న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. అంటే 22 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాల్చుతుండడం, ఇరాన్‌ మద్దతున్న లెబనాన్‌ షియా గ్రూపు హెజ్‌బుల్లాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. అమెరికాలో స్థిరపడిన అరబ్‌ ఓటర్లలో హ్యారి్‌సపై ఆగ్రహానికి కారణాలయ్యాయని అంటున్నారు. గాజాలో హమా్‌సపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి వైట్‌హౌస్‌ మద్దతివ్వడంపై ఇప్పటికే వారు మండిపడుతున్నారు. ఈ అంశం కారణంగానే మిచిగన్‌, విస్కోన్సిన్‌లలో ట్రంప్‌ మంచి ఆధిక్యం సాధించారని ‘క్వినిపియాక్‌’ సర్వే పేర్కొంది. ఇదిగాక ఆర్థిక వ్యవస్థ కుదేలవడం, ద్రవ్బోల్బణం పెరుగుదల, జీవన వ్యయం పెరగడం, ఇమిగ్రేషన్‌ సమస్యలు కూడా అధికార పార్టీకి ఇబ్బందులుగా పరిణమించాయి. దీని నుంచి తక్షణమే బయటపడాలని.. ఆయన ఆర్థిక విధానాలను విస్తృతంగా టార్గెట్‌ చేయాలంటూ 1992లో బిల్‌ క్లింటన్‌ విజయంలో కీలక భూమిక పోషించిన జేమ్స్‌ కార్‌విల్‌ పిలుపిచ్చారు. దిగుమతులపై సుంకాలు విధిస్తానని ట్రంప్‌ ప్రకటిస్తున్నారు. దీనివల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్‌పై విద్యావంతుల్లో, మధ్యతరగతి ప్రజల్లో వ్యతిరేకతకు ఇదే ముఖ్య కారణంగా భావిస్తున్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Oct 14 , 2024 | 05:58 AM