Share News

International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..

ABN , Publish Date - Jun 21 , 2024 | 07:10 AM

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతి ఏటా జూన్ 21న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, దాని ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

International Yoga Day 2024: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ఎప్పటి నుంచి జరుపుతున్నారు..
International Yoga Day 2024

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day 2024). ప్రతి ఏటా జూన్ 21న( june 21st) ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ స్థాయిలో యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, దీనిని జీవనశైలిలో భాగం చేసుకునేలా ప్రజలను ప్రేరేపించడం దీని ప్రధాన లక్ష్యం. యోగా దినోత్సవం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి అపోహలను తొలగిస్తారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంతో పాటు, మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చుకోవచ్చు.


ఎప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు?

భారతదేశాన్ని యోగా గురువుగా తీర్చిదిద్దిన ఘనత ప్రధాని మోదీ(modi)కే దక్కుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సెప్టెంబర్ 14, 2014న జరిగిన సమావేశంలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని మోదీ ప్రస్తావించారు. అదే సంవత్సరం డిసెంబర్ 11, 2014న ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ ఆమోదించింది. దీంతోపాటు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి జూన్ 21ని ఎంచుకోగా, ఈ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతు తెలిపాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.


మొదటిసారి ఎప్పుడు?

2015 జూన్ 21న యోగా దినోత్సవాన్ని మొదటిసారిగా జరుపుకున్నారు. ఈ రోజున లక్షలాది మంది సామూహికంగా యోగా చేశారు. భారతదేశంలో ఈ ప్రధాన కార్యక్రమం ఢిల్లీ(delhi)లోని రాజ్‌పథ్‌లో నిర్వహించబడగా, ఇందులో సుమారు 35,000 మంది పాల్గొన్నారు. మనస్సు, శరీరం మధ్య ఐక్యతను స్థాపించే ప్రాచీన భారతీయ అభ్యాసం యోగా ప్రపంచ వేదికపై అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఇది జరుపుకోవడం పదవ సంవత్సరం కావడం విశేషం.


2024 థీమ్ ఏంటి?

ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని ఒక ప్రత్యేక థీమ్‌(yoga theme)తో జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ దేశంలోని మహిళలకు అంకితం చేయబడింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 థీమ్ “మహిళా సాధికారత కోసం యోగా”. ఈ థీమ్ మహిళలు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించడమే లక్ష్యం. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ థీమ్ కింద అనేక కార్యక్రమాలు జరపనున్నారు.


ఇది కూడా చదవండి:

యూనికార్న్‌ ఆశలు గల్లంతు

విమానయానంలో భారత్‌ నంబర్‌ 3

Gold and Silver Rates Today: బంగారం, వెండి ధరలు భారీగా జంప్..ఎంతకు చేరాయంటే


Read Latest International News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 07:18 AM