Share News

Middle East Tension: అమెరికా సంచలన ఆదేశాలు.. తూర్పు ఆసియాకు యుద్ధ నౌకలు

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:46 PM

హమాస్ అధినే ఇస్మాయిల్ హినియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన నాటి నుంచి తూర్పు ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Middle East Tension: అమెరికా సంచలన ఆదేశాలు.. తూర్పు ఆసియాకు యుద్ధ నౌకలు

హమాస్ అధినే ఇస్మాయిల్ హినియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ ప్రకటించిన నాటి నుంచి తూర్పు ఆసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రాచ్య ప్రాంతానికి క్షిపణి జలాంతర్గాములను పంపించాలని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశాలు జారీ చేశారు. చేరుకోవాల్సిన ప్రాంతానికి మరింత వేగంగా ప్రయాణించాలంటూ ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌’ని ఆస్టిన్ ఆదేశించారంటూ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.


టెహ్రాన్‌లో హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే, అంతకంటే ముందు బీరూట్‌లో హిజ్బుల్లా గ్రూపునకు చెందిన సీనియర్ కమాండర్ హత్య తర్వాత తూర్పు ఆసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ రెండు హత్యలకు కారణమైన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని, కేవలం సైనిక పోస్ట్‌లకే పరిమితం కాబోమని, జనావాస నగరాలపై కూడా దాడి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఉద్రిక్తత అంతకంతకూ పెరిగిపోతోంది. యుద్ధం తలెత్తితే మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని చెబుతున్న అమెరికా.. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తామని చెబుతోంది.


ఇజ్రాయెల్‌కు సాధ్యమైన ప్రతి సాయం చేస్తాం: అమెరికా

ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధమని ఇరాన్, హిజ్బుల్లా ప్రకటన చేసిన తర్వాత మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. సాధ్యమైన ప్రతి సహకారం అందిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే మధ్యప్రాచ్యం ప్రాంతంలో అమెరికా క్రమంగా తన ప్రాభల్యాన్ని పెంచుకుంటోంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్’ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ మాట్లాడారని, ఇజ్రాయెల్‌ను రక్షించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అమెరికా కట్టుబడి ఉందంటూ హామీ ఇచ్చారని పాట్ రైడర్ వెల్లడించారు. దీనిపై అమెరికా రక్షణశాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు, పౌరుల పొంచివున్న హానిని తగ్గించడం అవసరం గురించి ఆస్టిన్, గాలంట్ చర్చించుకున్నారని వివరించారు.


కాగా ఇజ్రాయెల్ రక్షణ కోసం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఉన్న ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌’ని వీలైనంత త్వరగా తూర్పు ఆసియా ప్రాంతానికి వెళ్లాలని అమెరికా రక్షణశాఖ ఆదేశించింది. ఇక అమెరికా నుంచి మరో జలాంతర్గామి ‘యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌‌’ కూడా బయలుదేరింది. యుద్ధం తలెత్తవచ్చని భావిస్తున్న ప్రాంతానికి వీలైనంత చేరుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా లింకన్ నౌక మధ్యప్రాచ్యానికి ఎప్పటిలోగా చేరుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ క్యారియర్‌లో ఎఫ్-35 ఫైటర్ జెట్‌‌లతో పాటు ఎఫ్/ఏ-18 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా ఉన్నాయి.

Updated Date - Aug 12 , 2024 | 01:46 PM