Indian Railways: ఇరవై ఏళ్లలో యాభై ఒక్క వేల మంది..
ABN , Publish Date - Aug 29 , 2024 | 07:48 AM
ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో జరిగిన ప్రమాదాలపై జతిన్ యాదవ్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ ట్రైన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో తెలియజేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. సమాచారం ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లోకల్ రైళ్లు (Mumbai Local Trains) నిత్యం రద్దీగా ఉంటాయి. ప్రమాదాలు కూడా ఎక్కువే జరుగుతుంటాయి. రద్దీగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైల్వే ట్రాక్‌లలో పడిపోతుంటారు. అలా చాలా మంది చనిపోయారు. గత 20 ఏళ్లలో ముంబై లోకల్ రైళ్లలో జరిగిన ప్రమాదాల్లో 51 వేల మంది చనిపోయారు. ఇదే విషయాన్ని రైల్వేశాఖ బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపింది.
ఇలా వెలుగులోకి..
ముంబై లోకల్ రైల్వే స్టేషన్లలో జరిగిన ప్రమాదాలపై జతిన్ యాదవ్ అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్ ట్రైన్స్ వల్ల ఎంతమంది చనిపోయారో తెలియజేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. సమాచారం ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో గత 20 ఏళ్లలో జరిగిన ప్రమాదాలు, చనిపోయిన వ్యక్తుల సమాచారాన్ని అందజేసింది. పశ్చిమ రైల్వే విభాగంలో 22 వేల 481 మంది, మధ్య రైల్వే విభాగంలో 29,321 మంది చనిపోయారని హైకోర్టుకు అందజేసిన అఫిడవిట్‌లో రైల్వేశాఖ పేర్కొంది.
అలా తెలిసింది..
విరార్‌కు చెందిన జాదవ్ రోజు ముంబై లోకల్ ట్రైన్ మార్గంలో ప్రయాణిస్తుంటాడు. అలా ప్రయాణించే సమయంలో ట్రాక్‌లపై మృతదేహాలు కనిపించాయి. రోజుకు కనీసం ఐదుగురు చనిపోయిన కనిపించేవారు. ఇదే విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది బాంబే హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదాల గురించి బాంబే హైకోర్టు ధర్మాసనం రైల్వేశాఖను వివరణ కోరడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 20 ఏళ్లలో 51 వేల మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో అయినా రైల్వే బోర్డు మేల్కొవాలి. ఇకనైనా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
For Latest News click here