Share News

Train Accidents: నాటి యూపీఏలో.. నేటి ఎన్డీయేలో..

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:49 PM

పశ్చిమ బెంగాల్‌లో కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ రైలు‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Train Accidents: నాటి యూపీఏలో.. నేటి ఎన్డీయేలో..

పశ్చిమ బెంగాల్‌లో కాంచన్ జంగా ఎక్స్‌ప్రెస్ రైలు‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అలాగే ఈ ఎన్డీయే హాయాంలో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగాయని ఆరోపిస్తున్నాయి. ఎన్డీయే ఏలుబడిలో..ఈ దశాబ్ది కాలంలో వందల సంఖ్యలో రైలు ప్రమాదాలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అలాగే వేలాది మంది ప్రయాణికులు విగత జీవులుగా మారారంటూ మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సైతం సంధిస్తుంది.

అలాంటి వేళ.. నాటి యూపీఏ హయాంలో ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయి? ఎంత మంది మృత్యువాత పడ్డారు? ఎందరు గాయపడ్డారు? ఇక ఎన్డీయే ఏలుబడిలో ఎన్ని రైలు ప్రమాదాలు జరిగాయి? ఎంతమంది మృత్యువాత పడ్డారు? ఎందరు గాయపడ్డారంటే.. గణాంకాలు ఇలాగ ఉన్నాయి...


యూపీఏ హయాంలో (2004-2014) ...

ప్రమాదానికి గురైన రైళ్లు: 1,711

మృతులు: 2,453

గాయపడిన వారు: 4,486

పట్టాలు తప్పిన రైళ్లు: 867 (2002 నుంచి 2014 వరకు)

పట్టాలు తప్పిన రైళ్ల శాతం: 86.7

ట్రాక్ పునరుద్దరణ పనులు కోసం వార్షిక ఖర్చు మొత్తం: రూ. 4,702 కోట్లు (2005-2014)


ఎన్డీయే హయాంలో (2014- మార్చి 2023 వరకు)..

ప్రమాదానికి గురైన రైళ్లు: 638

మృతులు: 781

గాయపడిన వారు: 1,543

పట్టాలు తప్పిన రైళ్లు: 426 (2014 నుంచి 2023)

పట్టాలు తప్పిన రైళ్ల శాతం: 47.3

ట్రాక్ పునరుద్దరణ పనులు కోసం వార్షిక ఖర్చు మొత్తం: రూ.10,201 కోట్లు (2015-2023)

మరోవైపు గత తొమ్మిదేళ్లలో రైల్వే భద్రత కోసం రైల్వే శాఖ రూ.1,78,012 నిధులు కేటాయించింది. ( ఇది 2024 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులను కలుపుకొని ఈ మొత్తం..)

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 08:49 PM