Share News

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:37 AM

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్‌’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు

Former Judges: ‘హంగ్‌’ వస్తే కూటమిని పిలవండి

  • రాష్ట్రపతికి మాజీ జడ్జ్జీల లేఖ

న్యూఢిల్లీ, జూన్‌ 3: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకుండా ‘హంగ్‌’ వస్తే అలాంటి సందర్భాల్లో ప్రజాస్వామ్య సంప్రదాయాలను పాటించాలని కోరుతూ ఏడుగురు మాజీ న్యాయమూర్తులు రాష్ట్రపతికి లేఖ రాశారు.

ఎక్కువ సీట్లు సంపాదించిన, ఎన్నికల ముందు ఏర్పడిన కూటమిని ప్రభుత్వ ఏర్పాటు కోసం తొలుత ఆహ్వానించాలని కోరారు. ఎంపీల కొనుగోళ్లను నివారించడానికి ఈ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోతే అధికార బదిలీ సక్రమంగా జరిగేందుకు రాజ్యాంగాన్ని పాటించాలని కోరారు. రాష్ట్రపతితో పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌లకు కూడా ఈ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోతే అధికార బదిలీ సక్రమంగా జరగదన్న ఆందోళన నెలకొందని తెలిపారు.

Updated Date - Jun 04 , 2024 | 03:37 AM