Odisha: గణనీయంగా తగ్గిన పేద కుటుంబాలు
ABN , Publish Date - Jun 06 , 2024 | 11:17 AM
ఒడిశాలో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు.
భువనేశ్వర్: ఒడిశాలో నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) 24 ఏళ్ల ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఆ పార్టీని జనం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎమ్మెల్యేలతో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ సమావేశం అయ్యారు. తమ పార్టీ అధికారం చేపట్టేనాటికి ఒడిశాలో పరిస్థితులు దారుణంగా ఉండేవని గుర్తుచేశారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు 70 శాతం ఉండేవారని తెలిపారు. ఇప్పుడు 10 శాతానికి ఆ కుటుంబాలు తగ్గాయని వివరించారు.
‘గత 24 ఏళ్ల కాలంలో వ్యవసాయం, సాగునీటి రంగం, మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇచ్చాం. అయినప్పటికీ ఈ సారి ప్రజలు తిరస్కరించారు. అందుకు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్లూ ప్రజల కోసం పనిచేశాం. ఇకపై కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం అని’ నవీన్ పట్నాయక్ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఒడిశా అసెంబ్లీలో 147 స్థానాలు ఉన్నాయి. 78 సీట్లలో విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టబోతుంది. బీజేడీ 51 సీట్లను గెలిచి ప్రతిపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఎం ఒకటి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.