Share News

Narendra Modi: మోదీ తర్వాత ఎవరు? బీజేపీ ప్రధాని అభ్యర్థిపై ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే..!

ABN , Publish Date - Aug 23 , 2024 | 11:25 AM

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. ప్రతిపక్షాల విమర్శలు మాట ఎలా ఉన్నా.. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని అడిగితే.. మోదీ పేరే మొదట వినిపిస్తుంది. అయితే నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే మాత్రం నీళ్లు నమలాల్సిందే.

Narendra Modi: మోదీ తర్వాత ఎవరు? బీజేపీ ప్రధాని అభ్యర్థిపై ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే..!
After Modi, who?

భారత ప్రధానిగా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోదీ (Narendra Modi) పేరు స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా మారుమోగిపోతోంది. అత్యంత శక్తివంతమైన భారత ప్రధానిగా కూడా నరేంద్ర మోదీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. ప్రతిపక్షాల విమర్శలు మాట ఎలా ఉన్నా.. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని అడిగితే.. మోదీ పేరే మొదట వినిపిస్తుంది. అయితే నరేంద్ర మోదీ తర్వాత అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే మాత్రం నీళ్లు నమలాల్సిందే (After Modi, who?).


నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరూ అంటే ఠక్కున చెప్పడం కష్టం. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నితిన్ గడ్కరీ తదితరులు పేర్లు తెర మీదకు వచ్చినా వారికి మోదీ స్థాయి ఆమోదం లభించడం కష్టమే అని చెప్పాలి. అయితే ఈ విషయంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ``ఇండియా టుడే`` సంస్థ ``మూడ్ ఆఫ్ ది నేషన్`` సర్వే నిర్వహించింది (India Today Survey). దేశంలోని మెజారిటీ లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి ఆగస్టు ఎడిషన్ అంటూ విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం చూస్తే మోదీ తర్వాత ఏ నాయకుడికీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ లభించలేదు..


ఇండియా టుడే సర్వే ప్రకారం.. మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమిత్ షాకు 25 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు 19 శాతం ప్రజా మద్దతు లభించింది. ఇక, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ ప్రధాని కావాలని 13 శాతం మంది, రాజ్‌నాథ్‌ సింగ్‌కు మద్దతుగా 5 శాతం మంది, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కావాలని 5 శాతం మంది చెప్పినట్టు ఈ సర్వే వెల్లడించింది. 75 ఏళ్ల వయస్సు వచ్చాక రాజకీయాల నుంచి రిటైర్‌ అవ్వాలనే అనధికార నిబంధన బీజేపీలో కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం 75 ఏళ్లు రాబోతున్నాయి. మోదీ కూడా ఈ నిబంధన పాటించి ప్రధాని పదవి నుంచి తప్పుకుంటే ఎవరు ఆ బాధ్యతలు చేపడతారనే ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి..

Bangalore: ఈ మంతనాల మర్మమేమిటో..? కాంగ్రెస్‏లో ఏదో జరుగుతోంది...


Kolkata Trainee Doctor Case: కోల్‌కతా కేసు నిందితుడి సైకో టెస్ట్‌లో షాకింగ్ విషయాలు.. రెడ్ లైట్ ఏరియాకు..


మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 11:57 AM