Share News

Yogi on Agniveers: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్

ABN , Publish Date - Jul 26 , 2024 | 08:15 PM

అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక మాధ్యమ 'ఎక్స్‌'లో తెలిపారు. అగ్నివీరులు సర్వీసు నుంచి తిరిగి రాగానే పోలీసు సర్వీసు, పీఏసీలో ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాకావశాలు కల్పిస్తామని చెప్పారు.

Yogi on Agniveers: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్

లక్నో: అగ్నివీరులకు (Agniveers) ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సామాజిక మాధ్యమ 'ఎక్స్‌'లో తెలిపారు. అగ్నివీరులు సర్వీసు నుంచి తిరిగి రాగానే పోలీసు సర్వీసు, పీఏసీలో ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాకావశాలు కల్పిస్తామని చెప్పారు.


దేశ అభివృద్ధే కేంద్ర లక్ష్యం

కొన్ని రాజకీయాల పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి, ప్రగతి, అభ్యున్నతికి గత పదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని మీడియా ప్రకటనలో యోగి తెలిపారు. ఏ దేశమైనా, సమాజమైనా అభివృద్ధి చెందాలంటే ఎప్పటికప్పుడు సంస్కరణలు చేస్తూ వెళ్తుండాలని, ఈ దిశగా మోదీ నాయకత్వంలో గత పదేళ్లుగా ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రతిరంగంలోనూ చేపట్టిన సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రశంసించారు. జాతీయ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మనకు ఉందని, కేంద్రం తెచ్చిన సంస్కరణలతో మన సాయుధ బలగాలు కూడా బలపడ్డాయని చెప్పారు. ఆల్ట్రా మోడ్రన్ ఎయిర్‌క్రాప్టులతో మన సాయుధ బలగాలు సంసిద్ధమయ్యాయని, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రక్షణ ఉత్పత్తి కారిడార్ల అభివృద్ధి జరుగుతోందని, మన సాయుధ బలగాల్లో అగ్నివీరుల పథకం కూడా సంస్కరణల్లో భాగమేనని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని విపక్షాలను తప్పుపట్టారు. సంస్కరణలు, ప్రగతి, అభ్యున్నతిని అడ్డుకోవడమే వారి పనని, ఈ విషయంలో ప్రజలను కూడా వారి తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. జాతీయ భద్రతే అన్నింటికంటే సుప్రీం అని, అందుకోసం సాయుధ బలగాల సంస్కరణలను ముందుకు తీసుకు వెళ్లాల్సిందేనని అన్నారు.

CM Pushkar Singh Dhami: కార్గిల్ విజయ్ దివస్ వేళ ఉత్తరాఖండ్ ‘అగ్నివీరులకు’ గిఫ్ట్


సైన్యంలో సంస్కరణల కోసమే అగ్నివీర్ పథకాన్ని తెచ్చామని, ఈ పథకంపై యువతను విపక్షాలు తప్పుదారి పట్టిస్తు్న్నాయని శుక్రవారం 'కార్గిల్ దివస్' సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడి చేశారు. ఈ నేపథ్యంలో యూపీలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీరులకు యూపీలో రిజర్వేషన్ కల్పిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సైతం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. సైన్యంలో విధుల నిర్వహించిన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన అగ్నివీరులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేలా నిబంధనలు రూపొందించి చట్టం తెస్తామని చెప్పారు. వివిధ శాఖల్లో అగ్నివీరుల నైపుణ్యాలను ఉపయోగించుకుంటామన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 08:16 PM