Share News

Akhilesh Yadav: చిచ్చురేపిన ‘మటన్ కూర’.. చరిత్రలో నిలిచిపోతుందంటూ అఖిలేష్ వ్యంగాస్త్రాలు

ABN , Publish Date - Nov 18 , 2024 | 06:29 PM

తాను ఎన్నో యుద్ధాలు చూశానని.. కానీ, ఇలాంటి యుద్ధం నేనెప్పుడూ చూడలేదంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.

Akhilesh Yadav: చిచ్చురేపిన ‘మటన్ కూర’.. చరిత్రలో నిలిచిపోతుందంటూ అఖిలేష్ వ్యంగాస్త్రాలు
Akhilesh yadav

మీర్జాపూర్: ఉత్తర్ ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఇటీవల జరిగిన ఓ ఘటనపై సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీపై వ్యంగాస్త్రాలు గుప్పించారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన విందులో మటన్ ముక్కలకు బదులు గ్రేవీ మాత్రమే వడ్డించడంతో అది తీవ్ర వివాదానికి దారి తీసింది. మటన్ ముక్కలు రాలేదని అక్కడున్న కొందరు వడ్డించేవారిపై దాడికి దిగడంతో ఘర్షణ మొదలైంది. అక్కడున్నవారు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం పిడిగుద్దులు గుద్దుకోవడంతో మరింత ముదిరింది.


ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. ఇక్కడ మటన్ కోసం పెద్ద యుద్ధమే జరిగిందని నాకు తెలియదన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అది చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. తాను ఎన్నో యుద్ధాలను చూశానని కానీ, ఈ మటన్ యుద్ధం నేనెప్పుడూ చూడలేదంటూ చురకలు వేశారు. ఇటీవల వినోద్‌ కుమార్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు. దీంతో మీర్జాపుర్‌లోని మజావాన్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నవంబర్ 20న జరగనున్న ఉప ఎన్నిక కోసం ఇప్పటికే అక్కడ హడావుడి మొదలైంది. ఈ స్థానంలో గెలిచేందుకు ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Amit Shah: మణిపూర్‌కు మరో 50 సీఆర్‌పీఎఫ్ కంపెనీలు.. అమిత్‌షా సమీక్ష


Updated Date - Nov 18 , 2024 | 07:29 PM