Share News

Alert India : భారత్‌ అప్రమత్తం

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:40 AM

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్‌ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) నిఘాను పెంచింది.

 Alert India : భారత్‌ అప్రమత్తం

  • సరిహద్దు వెంట నిఘా పటిష్ఠం

  • ప్రధాని మోదీ నేతృత్వంలో క్యాబినెట్‌ కమిటీ భేటీ

  • కోల్‌కతా చేరుకున్న బీఎస్‌ఎఫ్‌ డీజీ దల్జీత్‌సింగ్‌

  • అప్రమత్తమైన భారత్‌

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గకపోవడంతో.. భారత్‌ అప్రమత్తమైంది. హింస నేపథ్యంలో ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశాలుండడంతో.. సరిహద్దు భద్రత దళం(బీఎ్‌సఎఫ్‌) నిఘాను పెంచింది. బీఎ్‌సఎఫ్‌ డీజీ దల్జీత్‌సింగ్‌ చౌదరి ఆగమేఘాల మీద కోల్‌కతా చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో 4,096 కిలోమీటర్ల మేర భారత్‌ సరిహద్దును పంచుకుంటుందని.. సరిహద్దు వెంబడి హైఅలెర్ట్‌ ప్రకటించామని ఆయన వివరించారు. మరోవైపు.. ప్రభుత్వం భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య రైలు సేవలను నిలిపివేసింది.

ఎయిరిండియా కూడా బంగ్లాదేశ్‌కు విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. హసీనాకు కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

కాగా.. హసీనా భారత్‌ను ఆశ్రయం కోరలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీలోని తన కూతురు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తూర్పు ఆసియా డైరెక్టర్‌ సైమా వాజిద్‌ను కలిసి.. ఆ తర్వాత లండన్‌కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. అయితే.. బ్రిటన్‌ ప్రభుత్వం ఆమెకు ఆశ్రయం కల్పించలేమని సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో హసీనా కొంతకాలం భారత్‌లోనే ఉండే అవకాశాలున్నాయి.

Updated Date - Aug 06 , 2024 | 03:40 AM