Share News

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

ABN , Publish Date - Jan 24 , 2024 | 04:53 PM

సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు.

Ram Mandir: ముఖం కప్పుకొని అయోధ్యకు వెళ్లిన అనుపమ్ ఖేర్.. ఎందుకిలా చేశారంటే?

సాధారణంగా.. రాజకీయ నేతలు, సినీ తారలు, ఇతర ప్రముఖులు రామమందిరం వంటి దేవాలయాలను సందర్శించేందుకు వీఐపీ పాస్‌లు పొందుతారు. ముఖ్యంగా.. రద్దీగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వీఐపీ దర్శనం చేసుకుంటారు. కానీ.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాత్రం అందుకు భిన్నంగా సాధారణ భక్తుడిగా ఇతర భక్తులతో కలిసి అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. కాకపోతే.. తానెవరో అక్కడున్న జనాలు గుర్తుపట్టకుండా ఉండేలా ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్నారు.


నిజానికి.. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అనుపమ్ ఖేర్ అతిథిగా హాజరయ్యారు. తనకు ఆలయ ట్రస్టు నుంచి అందిన ఆహ్వానం మేరకు జనవరి 22న ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రాణప్రతిష్ఠకు విచ్చేశారు. కానీ.. ఒక నటుడిగా కాకుండా సాధారణ భక్తుడిగా ఈ ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. జనవరి 23వ తేదీన రామాలయాన్ని సాధారణ భక్తులకు తెరిచినరోజే ఆయన విచ్చేశారు. అక్కడ తన వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని.. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఆలయానికి వెళ్లారు. అనంతరం.. ఆ రామాలయంలో తాను ఆస్వాదించిన ఆ అద్భుత అనుభూతిని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

‘‘జనవరి 22వ తేదీన నేను ఒక అతిథిగా రామమందిరానికి వచ్చాను. కానీ.. ఆ మరుసటి రోజు సాధారణ భక్తులతో కలిసి రామాలయాన్ని సందర్శించాలనుకొని వెళ్లాను. అక్కడ భక్తి సముద్రాన్ని చూసిన తర్వాత నా హృదయం ఉప్పొంగింది. ప్రజల్లో రాముడిని చూడాలన్న ఉత్సాహం, భక్తి.. మాటల్లో వర్ణించలేనిది. నేను బయటకు వస్తున్నప్పుడు.. ‘ముఖాన్ని కప్పుకుంటే ఏం జరగదు. రామ్‌లల్లా మిమ్మల్ని గుర్తించాడు’ అని ఒక భక్తుడు నా చెవిలో చెప్పాడు’’ అని అనుపమ్ ఖేర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కి తన వీడియోని ఎటాచ్ చేసిన ఆయన, తాను చనిపోయేదాకా దీనిని గుర్తుంచుకుంటానని క్యాప్షన్ పెట్టారు.

Updated Date - Jan 24 , 2024 | 04:53 PM