Share News

Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!

ABN , Publish Date - Aug 14 , 2024 | 02:52 PM

దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ రోజ ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.

Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!

శ్రీనగర్, ఆగస్ట్ 14: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన కెప్టెన్ దీపక్ సింగ్ మరణించారు. దోడా జిల్లాలోని శివగడ్- అస్సాడ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల నక్కి ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భారత సైన్యంతోపాటు జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అటవీ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ రోజ ఉదయం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందారు.


48 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన దీపక్..

దీపక్ సింగ్ 48 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు సైతం మరణించినట్లు సమాచారం. అయితే ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల రక్షణ శాఖ మంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.


సమాచారం అందడంతో తనిఖీలు..

అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం నుంచి భారత సైన్యం తనిఖీలు నిర్వహించింది. రాత్రి సమయం కావడం తనిఖీలను నిలిపివేశారు. బుధవారం ఉదయం మళ్లీ తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కెప్టెన్ దీపక్ సింగ్ మృతి చెందడం పట్ల ది వైట్ నైట్ కార్ప్స్ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది.


మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా..

మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. అందులోభాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు సమీక్షించేందుకు బుధవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయే భల్లాతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. అలాంటి వేళ ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.


ఈ రోజు కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సీఈసీ భేటీ..

మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం గత వారం ఆ రాష్ట్రంలో పర్యటించిన విషయం విధితమే. ఈ సందర్బంగా జమ్మూ కశ్మీర్ చీఫ్ సెక్రటరీ అటల్ డుల్లోతోపాటు కేంద్ర పాలిత ప్రాంత పోలీస్ చీఫ్ ఆర్ ఆర్ స్వైన్‌తో ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై చర్చించారు. అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఈ యాత్ర పూర్తయిన వెంటనే ఎన్నికల నగారా మోగనుందని ఓ ప్రచారం సైతం సాగుతుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 02:52 PM