Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.. ఎయిమ్స్ మెడికల్ టీమ్

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:41 PM

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్‌ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలులో పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.. ఎయిమ్స్ మెడికల్ టీమ్

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీకి (Excise policy) సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్‌ (AIIMS)కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థిని మెడికల్ బోర్డు శనివారంనాడు పరిశీలించింది. సుమారు అరంగంట సేపు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించింది. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటైంది. శనివారంనాడు కేజ్రీవాల్‌తో మెడికల్ బోర్డు జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో తీహార్ జైలుకు చెందిన ఇద్దరు వైద్యులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Delhi: మీకు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి


కేజ్రీవాల్ ఒంట్లోని చక్కెర స్థాయి 320కి పెరగడంతో గతవారం తొలిసారి ఆయనకు జైలులో ఇన్సులిన్ డోస్ ఇచ్చారు. దీనికి ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులతో రోజువారీ సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అయితే, టైప్-2 డయాబెటిక్‌తో బాధపడుతున్న ఆప్ సుప్రీంకు ఇన్సులెన్ అవసరా కాదా అనేది నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించింది. అయితే వైద్యులు ఇచ్చిన డయిట్ ఛార్ట్‌కు అనుగుణంగానే అది ఉండాలని తేల్చిచెప్పింది. బ్లడ్ షుగర్ పెరగడం ద్వారా మెడికల్ గ్రౌండ్స్‌లో మెడికల్ బెయిల్ పొందేందుకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు, ఆలూపూరీ, స్వీట్లు తీసుకుంటున్నట్టు ఈడీ ఆరోపించింది. అయితే, ఇన్సులన్, ఇతర డయాబెటిక్ మందులు ఇవ్వకుండా జైలులోనే ఢిల్లీ సీఎంను చంపే కుట్ర జరుగుతోందంటూ ఆప్ ఆరోపించింది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 03:41 PM