Share News

Delhi Excise policy case: ఈడీ కొత్త ఛార్జిషీటు.. 37వ నిందితుడిగా కేజ్రీవాల్

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:54 PM

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొత్త ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పేరును 37వ నిందితుడుగా చేర్చింది.

Delhi Excise policy case: ఈడీ కొత్త ఛార్జిషీటు.. 37వ నిందితుడిగా కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొత్త ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో 38 మందిని నిందితులుగా పేర్కొనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ పేరును 37వ నిందితుడుగా చేర్చింది. ఛార్జిషీటు ప్రకారం, ఈ కేసులో కేజ్రీవాల్‌ను కీలక నిందితుడిగా ఈడీ పేర్కొంది. గోవా ఎన్నికల్లో ముడుపుల సొమ్ము వినియోగించిన విషయం ఆయనకు తెలుసునని వివరించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు, మరో నిందితుడు వినోద్ చౌహాన్‌కు మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ వివరాలను ఛార్జిషీటులో ఈడీ ప్రస్తావించింది. గోవా ఎన్నికల సందర్భంగా కె.కవిత వ్యక్తిగత సహాయకుడు రూ.25.5 కోట్ల సొమ్మును వినోద్‌ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి పంపాడని, అరవింద్ కేజ్రీవాల్‌తో వినోద్‌కు మంచి సంబంధాలున్నాయనే విషయం వారి మధ్య జరిగిన ఛాటింగ్‌తో స్పష్టమవుతోందని ఈడీ పేర్కొంది.

Nitish Kumar: మీ పాదాలకు మొక్కుతా... సహనం కోల్పోయిన సీఎం నితీష్


కేజ్రీవాల్ బెయిలుపై ఈడీ సవాల్..15న విచారణ

కాగా, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిలును సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై జూలై 15న విచారణకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు చేపట్టనుంది. కేజ్రీవాల్‌కు జూన్ 20న ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేయగా, దానిపై హైకోర్టు స్టే ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 03:54 PM