Arvind Sawant: క్షమాపణలు చెప్పిన ఎంపీ, నన్ను టార్గెట్ చేశారంటూ ఆవేదన
ABN , Publish Date - Nov 02 , 2024 | 08:18 PM
షైని ఎన్‌సీపై అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగానే కొందరు తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంబై: ఏక్‌నాథ్ షిండే శివసేన అభ్యర్థిని షైని ఎన్‌సీ (Shaina NC)పై అనుచిత వ్యాఖ్యల వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న శివసేన (UBT) ఎంపీ అరవింద్ సావంత్ ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగానే కొందరు తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
India-Canada: అమిత్‌షాపై అసంబద్ధ ఆరోపణలు.. కెనడా హైకమిషన్ ప్రతినిధికి భారత్ సమన్లు
బీజేపీ నుంచి షిండే శివసేనలో చేరిన షైని ఎన్‌సీని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నిలబెట్టింది. దీనిపై సావంత్ ఇటీవల మీడియా అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ.. ''ఆమె పరిస్థితి చూడండి. జీవతకాలమంతా ఆమె బీజేపీలో అన్నారు. ఇప్పుడు ఆమె మరో పార్టీలో చేరారు. ఇంపోర్టెట్ మాల్ ఇక్కడ పనిచేయదు, ఒరిజినల్ మాల్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది'' అని వ్యాఖ్యానించారు. దీనిపై నవంబర్ 1న వివాదం రేగింది. మహిళా గౌరవాన్ని కించపరుస్తూ తనపై సావంత్ వ్యాఖ్యలు చేశారంటూ షైని ఎన్‌సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సావంత్ తిరిగి స్పందిస్తూ, మహిళల పట్ల తాను ఎప్పుడూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, మహిళలను గౌరవించే బాలాసాహెబ్ పార్టీ నుంచి తాము వచ్చామని వివరణ ఇచ్చారు. ఈ వివాదానికి శనివారంనాడు తెరదించే ప్రయత్నం చేస్తూ, తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది కలగించి ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
''గత 24 గంటల నుంచి నేను ఒక మహిళలను కించపరచారనే వాతావరణాన్ని కొందరు సృష్టించారు. అయితే నేను నా జీవితంలో ఇంతవరకూ ఏ మహిళను కించపరచలేదు. నా మాటలను వక్రీకరించి వేరే అర్ధాన్ని కొందరు సృష్టించారు. అయినప్పటికీ నా మాటలు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నాను"అని సావంత్ అన్నారు.
ఇవి కూడా చదవండి: