Share News

Sindhudurg: లలిత భర్త సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:06 AM

మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లా అటవీ ప్రాంతంలో యూఎస్ మహిళ లలిత కేయి కుమార్ ఎస్‌ను ఇనుప గొలుసులో బంధించిన ఆమె భర్త సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై హత్యాయత్నంతోపాటు న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద సింధుదుర్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సింధుదుర్గ్ పోలీసులు వెల్లడించారు.

Sindhudurg: లలిత భర్త సతీశ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

ముంబయి, జులై 31: మహారాష్ట్రలో సింధుదుర్గ్ జిల్లా అటవీ ప్రాంతంలో యూఎస్ మహిళ లలిత కేయి కుమార్ ఎస్‌ను ఇనుప గొలుసులో బంధించిన ఆమె భర్త సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై హత్యాయత్నంతోపాటు న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద సింధుదుర్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సింధుదుర్గ్ పోలీసులు వెల్లడించారు.

Wayanad landslides: 143కు చేరిన మృతులు.. రాహుల్, ప్రియాంక పర్యటన వాయిదా


సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో..

గత వారం సింధుదర్గ్ అటవీ ప్రాంతంలో ఇనుప గొలుసులతో కట్టి పడేసి ఉన్న ఓ మహిళ చేసిన ఆర్తనాదాలను పశువుల కాపరి విన్నాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు అతడు తెలియజేశాడు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులతోపాటు గ్రామస్తులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో భారీ వృక్షాలకు ఇనుప గొలుసులతో బంధించి.. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళను ఈ సందర్భంగా వారు గుర్తించారు.


మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి..

40 రోజులుగా ఎటువంటి ఆహారం తీసుకోక పోవడంతో.. ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో తొలుత ఆమెను సింధుదుర్గ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె ఆరోగ్యం మానసికంగా కూడా బలహీన పడడంతో.. బింబోలిలోని గోవా మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతుంది. ఆ క్రమంలో ఆమె ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుటపడుతుంది. దీంతో పోలీసులకు ఆమె పలు కీలక విషయాలను వివరించింది.


తమిళనాడులో భర్త సతీశ్‌తో కలిసి..

తన భర్త సతీశ్‌తో కలిసి తమిళనాడులో దశాబ్దం పాటు నివసిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ సందర్భంగా తనతో భర్త వ్యవహరించిన తీరును సైతం ఈ సందర్బంగా పోలీసులకు కాగితంపై రాసి వివరించింది. ఇక గత 40 రోజులుగా తాను నీరు, ఆహారం లేకుండా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నానని చెప్పింది. ఈ ఆటవీ ప్రాంతంలో నీరు, ఆహారం లేకుండా ఉంటే.. తాను మరణిస్తానని భర్త సతీశ్ భావించారని.. దీంతో తను వదిలి వెళ్లారని పోలీసులకు ఆమె వివరించింది.


పాస్ పోర్ట్ జిరాక్స్‌తోపాటు ఆధార్ కార్డు

మరోవైపు ఆటవీ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను పోలీసులు గమనించారు. అందులో యూఎస్ పాస్ పోర్ట్‌ జిరాక్స్‌తోపాటు తమిళనాడు చిరునామాతో ఉన్న ఆధార్ కార్డును సైతం వారు గుర్తించారు. ఆ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కోంకణ్ రేంజ్ ఐజీ సంజయ్ దారాడే మాట్లాడుతూ.. బాధితురాలు లలిత్ కేయి కుమార్ స్టేట్‌మెంట్ రికార్డు చేశామని తెలిపారు. అలాగే ప్రాథమిక సమాచారాన్ని సైతం అందించారని చెప్పారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఐజీ వెల్లడించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 09:35 AM