Share News

కేంద్రం హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:31 AM

ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంజయ్‌కు విద్యారణ్య భారతి స్వామిజీ ఆశీస్సులు అందించారు.

కేంద్రం హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సంజయ్‌కు విద్యారణ్య భారతి స్వామిజీ ఆశీస్సులు అందించారు. కార్యక్రమంలో సహచర కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, వెంకట రమణారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్‌, మాజీ ఎమ్మెల్యేలు మర్రి శశిధర్‌ రెడ్డి, సంకినేని వేంకటేశ్వర రావు, ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌ తదితరులు బండి సంజయ్‌ను సత్కరించారు.

Updated Date - Jun 14 , 2024 | 05:32 AM