Share News

Bangalore: వారిద్దరూ విద్యావంతులు... సన్యాసులుగా మారదలిచారు..!

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:54 PM

వారిద్దరూ డిగ్రీ పూర్తి చేసిన యువతులు. ఈ వయస్సులో సాధారణంగా ఉద్యోగం లేదా పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ భిన్నంగా సన్యాసులు కాదలిచారు. దావణగెరె(Davanagere)లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 26 ఏళ్ల మానసి కుమారి, ముముక్షా భక్తికుమారిలను ఊరేగించారు.

Bangalore: వారిద్దరూ విద్యావంతులు... సన్యాసులుగా మారదలిచారు..!

- దావణగెరెలో భారీ ఊరేగింపుతో సంబరం

బెంగళూరు: వారిద్దరూ డిగ్రీ పూర్తి చేసిన యువతులు. ఈ వయస్సులో సాధారణంగా ఉద్యోగం లేదా పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ భిన్నంగా సన్యాసులు కాదలిచారు. దావణగెరె(Davanagere)లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 26 ఏళ్ల మానసి కుమారి, ముముక్షా భక్తికుమారిలను ఊరేగించారు. సన్యాసం స్వీకరించేందుకు ముందు జరిగే ప్రత్యేక కార్యక్రమాలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. మానసి కుమారి మాస్టర్‌ ఆఫ్‌ సైకాలజీ(Master of sychology) చదివారు.

ఈ వార్తను కూడా చదవండి: Former CM: సీఎంగారూ.. మీరే పగటి కలలు కంటున్నారు..


గోకాక్‌కు చెందిన ముముక్షా భక్తికుమారి బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి రెండు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులతోపాటు దావణగెరె బెళగావి(Davanagere Belagavi) ప్రాంతంలో నివసించే జైన మతస్థులు దీక్షా ఊరేగింపులో పాల్గొన్నారు. వీరు నవంబరు 17న జార్ఖండ్‌లోని రుజుబాలికా ప్రదేశంలో సన్యాసం స్వీకరించనున్నట్టు వారి కుటుంబీకులు తెలిపారు. దావణగెరెలో ఇప్పటివరకు సన్యాసత్వం స్వీకరించినవారు 64 మంది అయ్యారు.


.......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...........................................................................

Heavy rains: ఇంకా ముంపులోనే బెంగళూరు నగరం..!

- పాఠశాలలకు సెలవు

బెంగళూరు: నగరంలో నీట మునిగిన ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బుధవారం సాయంత్రం నగరమంతటా వర్షం కురిసింది. యలహంక(Yalahanka) పరిధిలోని కేంద్రీయవిహార్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను డీసీఎం డీకే శివకుమార్‌ పరిశీలించారు. అయితే 20 ప్లాట్‌లకు చెందినవారు అపార్ట్‌మెంట్‌లను వీడేది లేదని మరో ప్రాంతానికి వెళ్లి ఎక్కడ జీవనం సాగించాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రీయ విహార్‌లో 603 ప్లాట్‌లు ఉండగా 95శాతం మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినట్టు బీబీఎంపీ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ ప్రకటించారు.

pandu2.jpg


ఈ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని మళ్లించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వారం రోజులపాటు సమీపంలోని హోటళ్లలో బస చేసేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లకు తాళాలు వేసుకుని రావాలని సూచించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా 20 కుటుంబాలకు చెందిన వారిని తరలించేందుకు చర్చలు జరిగాయి. ఓ నివాసి మాట్లాడుతూ 25 ఏళ్లుగా ఇక్కడే ఉన్నానని మరోచోటుకు వెళ్లలేనన్నారు. మరోవైపు సహకారనగర్‌లోని లోతట్టు ప్రాంతాలలో వరదనీటిని తోడేసే ప్రక్రియ కొనసాగుతోంది. బెంగళూరు(Bengalore) దక్షిణ విభాగం యలచేనహళ్ళి రామకృష్ణనగర్‌,


pandu2.2.jpg

ఫయాజాబాద్‌లలో వంద ఇళ్లలోకి మురుగునీరు చేరింది. జలమండలి మరమ్మతులు చేపట్టకపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి వచ్చినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి నీరు ఇళ్లలోకి చేరినట్టు తెలిపారు. సర్జాపుర, కోరమంగలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాగా బాబుసాపాళ్యలో కూలిన భవన ప్రాంతాన్ని డీసీఎం డీకే శివకుమార్‌ సందర్శించారు.


అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే బీబీఎంపీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. భవన యజమానితోపాటు కంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నేడు కూడా పాఠశాలలకు సెలవు: నగరంలో మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందనే వాతావరణశాఖ హెచ్చరికలతో గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 12:54 PM