Share News

Bangalore: వయనాడ్‌లో వర్షబీభత్సం.. కావేరి తీర జిల్లాల్లో అలర్ట్‌!

ABN , Publish Date - Aug 01 , 2024 | 01:31 PM

కేరళ రాష్ట్రం వయనాడ్‌(Wayanad)లో భారీ వర్షాలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. వయనాడ్‌ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు హోరెత్తిస్తుండడంతో కావేరి నది(Kaveri river)కి అనుబంధమైన జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించారు. వయనాడ్‌లో కురిసే వర్షం ద్వారానే కావేరి నదికి అనుబంధమైన కేఆర్‌ఎస్‌, కబిని జలాశయాలకు వరద చేరుతుంది. మరోవైపు రాష్ట్రంలోని కావేరి తీరంతోపాటు మలెనాడు, తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Bangalore: వయనాడ్‌లో వర్షబీభత్సం.. కావేరి తీర జిల్లాల్లో అలర్ట్‌!

- రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తం

- జిల్లా అధికారులతో సమీక్షించిన సీఎం

బెంగళూరు: కేరళ రాష్ట్రం వయనాడ్‌(Wayanad)లో భారీ వర్షాలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. వయనాడ్‌ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు హోరెత్తిస్తుండడంతో కావేరి నది(Kaveri river)కి అనుబంధమైన జిల్లాల్లో అలర్ట్‌ ప్రకటించారు. వయనాడ్‌లో కురిసే వర్షం ద్వారానే కావేరి నదికి అనుబంధమైన కేఆర్‌ఎస్‌, కబిని జలాశయాలకు వరద చేరుతుంది. మరోవైపు రాష్ట్రంలోని కావేరి తీరంతోపాటు మలెనాడు, తీరప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర(Maharashtra)లో వర్షాలతో ఉత్తరకన్నడ జిల్లాలోని బెళగావి, బాగల్కోటె ప్రాంతా ల్లో భారీగా వరద పోటెత్తుతోంది.

ఇదికూడా చదవండి: Tungabhadra: ‘తుంగభద్ర’కు మళ్లీ పెరిగిన వరద..


ఈ నేపథ్యంలో కేరళలో చోటు చేసుకున్న వర్షబీభత్సంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల రాష్ట్రంలోనూ ఉత్తరకన్నడ, చిక్కమగళూరు, బాగల్కోటె, హాసన్‌(Uttarkannada, Chikkamagalur, Bagalkote, Hassan) జిల్లాల్లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు నిరంతరంగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రభావం ఎక్కడికి దారి తీస్తుందోనని జిల్లా స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వరద పీడిత జిల్లాలు, జలాశయాలు ఉండే జిల్లాల అధికారులు, జిల్లా పంచాయతీ సీఈఓలు, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అతివృష్టి, వర్షపు నష్టాలు, వరద, కొండచరియలు విరిగిపడిన ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

pandu2.2.jpg


జిల్లా అధికారులు హెడ్‌క్వార్టర్స్‌(Headquarters)లోనే ఉండాలని సూచించారు. అన్నిశాఖలు సమన్వయంతో కార్యాచరణ కొనసాగించాలని ఆదేశించారు. చిక్కమగళూరు జిల్లాలో పలు చోట్ల ఇళ్లు నీట మునగడం, కొండ చరియలు పడ్డం, రైల్వేట్రాక్‌(Railway track)పై అడ్డంకులు ఏర్పడ్డం వంటి సంఘటనలు చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాలు నిర్ణీత స్థాయికి మించి కురుస్తున్నాయన్నారు. మరోవైపు మహారాష్ట్ర, కేరళ ప్రాంతంలో వర్షాలతో వరద పోటెత్తుతోందని తద్వారా జరిగే నష్టాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలవారీగా పరిస్థితిని అంచనా వేశారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2024 | 01:31 PM