Share News

Bengaluru : అమెజాన్‌ పార్సిల్‌లో నాగుపాము

ABN , Publish Date - Jun 20 , 2024 | 03:50 AM

ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌లో వీడియో గేమ్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్‌ కంట్రోలర్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది.

Bengaluru : అమెజాన్‌ పార్సిల్‌లో నాగుపాము

బెంగళూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌లో వీడియో గేమ్‌కు సంబంధించిన ఎక్స్‌బాక్స్‌ కంట్రోలర్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. ఆ సంస్థ నుంచి వచ్చిన పార్సిల్‌లో పాము ప్రత్యక్షమైంది. బెంగళూరు సర్జాపురలో నివసించే సాఫ్ట్‌వేర్‌ దంపతులు వారం కిందట అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్‌ కంట్రోలర్‌ను ఆర్డర్‌ చేశారు. పార్సిల్‌ మంగళవారం రావడంతో తెరిచే ప్రయత్నం చేయగా.. నాగపాము పడగవిప్పి ప్రత్యక్షమైంది. పార్సిల్‌ బాక్స్‌కు చుట్టిన ప్లాస్టిక్‌ టేప్‌కు పాము అతుక్కుపోయి ఉండడంతో బయటకు రాలేకపోయింది. వెంటనే ఆ పార్సిల్‌ను ఓ బకెట్‌లో ఉంచి.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై అమెజాన్‌ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. బాధితులు ఎక్స్‌బాక్స్‌కు చెల్లించిన మొత్తాన్ని వాపసు చేసింది. విషపూరితమైన పాము ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరుపుతామని పేర్కొంది.

Updated Date - Jun 20 , 2024 | 03:50 AM