Share News

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:52 AM

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

బెంగళూరు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

డీకే శివకుమార్‌ అక్రమాస్తులు కలిగి ఉన్నారని గత బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అందుకు అనుగుణంగా సీబీఐ దర్యాప్తు చేసింది. కేసు దర్యాప్తు దాదాపు తుదిదశకు చేరిన సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. కేసు విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Aug 13 , 2024 | 05:52 AM