Share News

kolkata RG Kar Hospital: కపిల్ సిబల్‌కు బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కీలక సూచన

ABN , Publish Date - Aug 23 , 2024 | 05:40 PM

కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం తరఫున వాదించ వద్దని కపిల్ సిబల్‌కు అధిర్ రంజన్ చౌదరి హితవు పలికారు. ఈ కేసు నుంచి వైదొలగాలని ఆయనను అభ్యర్థించాలనుకుంటున్నారన్నారు.

kolkata RG Kar Hospital: కపిల్ సిబల్‌కు బెంగాల్ కాంగ్రెస్ పార్టీ నేత కీలక సూచన

కోల్‌కతా, ఆగస్ట్ 23: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్‌కు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి కీలక సూచన చేశారు. కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వం తరఫున వాదించ వద్దని కపిల్ సిబల్‌కు ఆయన హితవు పలికారు.

ఈ కేసు నుంచి వైదొలగాలని ఆయనను అభ్యర్థించాలనుకుంటున్నారన్నారు. ఈ వైద్యురాలి హత్యాచార ఘటన బెంగాల్ ప్రజల మనోభావలకు సంబంధించిన అంశమని అభివర్ణించారు. బెంగాల్‌లోని సామాన్య ప్రజల ఆవేశాన్ని దృష్టిలో పెట్టుకుని, నేరస్తులను రక్షించకుండా ఉంటేనే మంచిదంటూ కపిల్ సిబల్‌కు ఈ సందర్భంగా అధిర్ రంజన్ విజ్జప్తి చేశారు.

Also Read: Uttar Pradesh: 40 మంది విద్యార్థులకు గాయాలు.. అయిదుగురి పరిస్థితి విషమం


కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం ఘటన కేసును తమ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించేందు 21 మంది ప్రముఖ న్యాయవాదులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. వారిలో న్యాయవాది కపిల్ సిబల్ ఉన్నారు. దాంతో ఈ కేసులో వాదించకుండా వైదొలగాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌కు అధిర్ రంజన్ చౌదరి సూచించారు.

అదీకాక ఈ హత్యాచార ఘటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ తీవ్ర సందేహాస్పదంగా ఉన్నాయన్నారు. వైద్యురాలు హత్యాచారంతో మరణిస్తే.. ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తల్లిదండ్రులను ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారన్నారు. అలాగే ఈ ఘటన అనంతరం ఆసుపత్రిలో క్రైమ్ సీన్స్‌ మొత్తం మార్చివేశారంటూ సీబీఐ.. ఇప్పటికే కోల్‌కతా హైకోర్టుకు వివరించిందని గుర్తు చేశారు.

Also Read: Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు


అదే విధంగా ఆమె మృతదేహానికి అంత్యక్రియలు, ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు తదితర అంశాలు సైతం అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. ఇక ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై వేలాది మంది అర్థరాత్రి దాడికి తెగబడడం పలు సందేహాలకు తావిచ్చే విధంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు.

అలాంటి వేళ.. ఈ ప్రభుత్వం తరఫున మీరు వాదిస్తే.. ప్రజల్లోకి వెళ్లే ఆ సంకేతాలు ఎలా ఉంటాయోనని కపిల్ సిబాల్‌కు ఈ సందర్భంగా అధిర్ రంజిన్ చౌదరి సూచించారు. అలాగే ఈ కేసు వాదిస్తున్న కపిల్ సిబల్‌ పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేక పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని గుర్తు చేశారు.

Also Read: ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ


గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కపిల్ సిబల్ కేంద్ర మంత్రిగా వ్యవహారించారని.. అదీ కూడా అత్యంత కీలకమైన మానవ వనరుల శాఖ మంత్రిగా ఆయన పని చేశారని తెలిపారు. అలాంటి వేళ.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు నుంచి వైదొలగాలని కపిల్ సిబల్‌కు అధిర్ రంజిన్ చౌదరి సూచించారు. ఇక వైద్యురాలిపై హత్యాచారం అనంతరం సీఎం మమతా బెనర్జీ మృతురాలి తల్లిదండ్రులతో వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి ఎండగట్టారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 05:42 PM