Share News

Lucknow: బ్రిజ్‌ భూషణ్‌ టికెట్‌ ఆయన కొడుక్కే..

ABN , Publish Date - May 03 , 2024 | 04:14 AM

మహిళా రెజ్లర్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు మరోసారి టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.

Lucknow: బ్రిజ్‌ భూషణ్‌ టికెట్‌ ఆయన కొడుక్కే..

లఖ్‌నవూ, మే 2: మహిళా రెజ్లర్‌లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు మరోసారి టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానాన్ని తన చిన్న కుమారుడు, రాష్ట్ర రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌కు కేటాయించింది.


జాతీయ స్థాయి షూటర్‌ అయిన కరణ్‌, ఆస్ట్రేలియాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ను పూర్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని మరో ప్రముఖ లోక్‌సభ నియోజకవర్గమైన రాయ్‌బరేలీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి దినేశ్‌ ప్రతా్‌పసింగ్‌ పేరును బీజేపీ ఖరారు చేసింది.

Updated Date - May 03 , 2024 | 04:14 AM