Share News

Budget 2024: యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు.. బడ్జెట్‌పై మోదీ

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:09 PM

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌ (Union Budget 2024)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ ఇదని, యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు లభిస్తాయని అన్నారు.

Budget 2024: యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు.. బడ్జెట్‌పై మోదీ

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌ (Union Budget 2024)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ ఇదని, యువతకు ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు లభిస్తాయని అన్నారు. యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత కల్పించినట్టు చెప్పారు.


''దేశంలోని గ్రామాలు, పేదలు, రైతులను అభ్యుదయ పథంలోకి తీసుకువెళ్లే బడ్జెట్ ఇది. గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తులయ్యారు. మధ్యతరగతి ప్రజానీకానికి కొత్త బలం చేకూరుతుంది. గిరిజన సమాజం, దళితులు, వెనుకబడిన తరగతుల సాధికారతకు కొత్త ప్రణాళికలను బడ్జెట్ తీసుకువచ్చింది'' అని మోదీ తెలిపారు.


మహిళల ఆర్థిక స్వావలంబనకు బడ్జెట్ దోహదపడుతుందని, ముద్ర రుణాలను రూ.20 లక్షలకు పెంచామని, భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తామని అన్నారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పెద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పారు. పన్నుల తగ్గింపు, టీడీఎస్ నిబంధనలను సరళతరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. రక్షణరంగం స్వయం సమృద్ధి సాధించేందుకు బడ్జెట్‌లో అనేక ప్రొవిజన్స్ కల్పించామని, పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని మోదీ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2024 | 03:13 PM