Sikar Bus Accident: కల్వర్ట్‌ను బస్సు ఢీకొని 12 మంది మృతి
ABN , Publish Date - Oct 29 , 2024 | 06:41 PM
సాలాసర్ నుంచి వస్తున్న బస్సు మధ్యాహ్న 2 గంటల ప్రాంతంలో లక్ష్మణ్‌గఢ్ వద్ద అదుపుతప్పి ఒక కల్వర్ట్‌ను ఢీకొన్నట్టు జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు.పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడటంతో వారిని లక్ష్మణ్‌గఢ్, సీకర్ ఆసుపత్రుల్లో చేర్చామని చెప్పారు.
సికార్: రాజస్థాన్ (Rajasthan)లోని సీకర్ జిల్లాలో మంగళవారంనాడు ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. సాలాసర్ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు లక్షణ్‌గఢ్‌కు దాటిన తర్వాత ఒక కల్వర్ట్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగ్రాతులను లక్ష్మణ్ గఢ్‌లోని ఆసుపత్రిలో చేర్చగా పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
PM Modi: ఆ రెండు రాష్ట్రాల వయోవృద్ధులకు మోదీ క్షమాపణ
సాలాసర్ నుంచి వస్తున్న బస్సు మధ్యాహ్న 2 గంటల ప్రాంతంలో లక్ష్మణ్‌గఢ్ వద్ద అదుపుతప్పి ఒక కల్వర్ట్‌ను ఢీకొన్నట్టు జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు. 12 మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గాయపడ్డారని, వారిని లక్ష్మణ్‌గఢ్, సీకర్ ఆసుపత్రుల్లో చేర్చామని చెప్పారు.
కాగా, ఏడుగురు ప్రయాణికులు లక్ష్మణ్‌గఢ్‌లో మృతిచెందినట్టు ఎస్‌కే ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేంద్ర ఖిచడ్ తెలిపారు. మొత్తం 27 మంది పేషెంట్లు తమ ఆసుపత్రికి వచ్చారని, ఇద్దరు మార్గమధ్యంలోనే మృతిచెందగా, చికిత్స అందిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పాయారని తెలిపారు. ఏడుగురు పేషెంట్లను తదుపరి చికిత్స కోసం జైపూర్‌కు పంపుతున్నామని, ప్రస్తుతం 22 నుంచి 23 మంది తమ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.
సీఎం సంతాపం
సీకర్ జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ సాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించామని అన్నారు.
ఇవి కూడా చదవండి..
కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు
ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే
Read More National News and Latest Telugu News