Share News

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని

ABN , Publish Date - Nov 04 , 2024 | 03:35 AM

భారత్‌-కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో దీపావళి వేడుకలు జరుపుకొన్న వీడియోని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని

  • భారత్‌,కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ చర్య

న్యూఢిల్లీ, నవంబరు 3: భారత్‌-కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో దీపావళి వేడుకలు జరుపుకొన్న వీడియోని ఆదివారం సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘‘హ్యాపీ దీపావళి... ఈ వారం హిందువులతో ఎన్నో ప్రత్యేక సందర్భాలు గడిచాయి..’’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కెనడాలోని మూడు హిందూ ఆలయాలవారు బహూకరించిన కంకణాలను ట్రూడో చేతికి కట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది. ‘‘ఈ కంకణాలు అదృష్టాన్ని ఇస్తాయి.. రక్షణ కల్పిస్తాయి.. అవి ఊడిపోయేంత వరకు వాటిని నేను తొలగించను..’’ అని ట్రూడో తన పోస్టులో పేర్కొన్నారు. అక్టోబరు 31న కూడా ట్రూడో కెనడియన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ కెనడాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మందితో దీపావళి జరుపుకోబోతున్నామని ఆ రోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు, 2023 సెప్టెంబరులో నిజ్జర్‌ హత్య ఘటన తర్వాత భారత్‌-కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.

Updated Date - Nov 04 , 2024 | 03:35 AM