Share News

Chennai: మీనంబాక్కంలోనే ఆ నలుగురు..!

ABN , Publish Date - May 22 , 2024 | 12:22 PM

శ్రీలంక నుంచి ఐసిస్‏కు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం 11 గంటలకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం(Chennai International Airport)లో దిగి ఏడు గంటలపాటు అక్కడే గడిపారంటూ దర్యాప్తులో తేలడంతో భద్రతాధికారులు ఉలిక్కిపడ్డారు.

Chennai: మీనంబాక్కంలోనే ఆ నలుగురు..!

- 7 గంటలపాటు ప్రయాణికులతో గడిపిన ఉగ్రవాదులు

- ఉలిక్కిపడిన చెన్నై విమానాశ్రయ సిబ్బంది

చెన్నై : శ్రీలంక నుంచి ఐసిస్‏కు చెందిన నలుగురు ఉగ్రవాదులు ఆదివారం ఉదయం 11 గంటలకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం(Chennai International Airport)లో దిగి ఏడు గంటలపాటు అక్కడే గడిపారంటూ దర్యాప్తులో తేలడంతో భద్రతాధికారులు ఉలిక్కిపడ్డారు. విమానాశ్రయంలోని ప్రయాణికుల గుంపులోనే ఆ నలుగురూ అటూ ఇటూ సంచరిస్తూ సాయత్రం ఆరుగంటల వరకు గడిపారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు అహ్మదాబాద్‌కు వెళ్లే విమానంలో గుజరాత్‌కు పయనమయ్యారు. ఈ సమాచారం అందటంతో గుజరాత్‌ పోలీసులు(Gujarat Police) ఆ నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

ఇదికూడా చదవండి: Chennai: కొత్తరకం కరోనా వైరస్‏పై ఆందోళన వద్దు...


చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతాదళం అధికారులు, పోలీసులు గనుక అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఆ నలుగురినీ నిర్బంధించి ఉండవచ్చు. ఏడు గంటలపాటు విమానాశ్రయంలోనే గడిపిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళం అధికారులు గమనించకపోవడం అక్కడి భద్రతా లోపమేనని చెబుతున్నారు. ప్రస్తుతం నలుగురు ఉగ్రవాదులు పట్టుకోవడంలో విమానాశ్రయ భద్రతాసిబ్బంది వైఫల్యంపై ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్లలో లోపాలను కూడా చక్కదిద్దటానికి చర్యలు చేపట్టనున్నారు.

nani3.2.jpg


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 12:22 PM