Share News

NEET Hearing: సెక్యూరిటీని పిలవండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

ABN , Publish Date - Jul 23 , 2024 | 06:21 PM

'నీట్' లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా మధ్యలో అవాంతరం కలిగించేందుకు ప్రయత్నించిన ఒక న్యాయవాదిపై సీజేఐ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్యూరిటీని పిలవండి' అంటూ సీరియస్ అయ్యారు.

NEET Hearing: సెక్యూరిటీని పిలవండి.. న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం

న్యూఢిల్లీ: 'నీట్' (NEET)లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా మధ్యలో అవాంతరం కలిగించేందుకు ప్రయత్నించిన ఒక న్యాయవాదిపై సీజేఐ (CJI) డీవై చంద్రచూడ్ (DY chandrachud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సెక్యూరిటీని పిలవండి' అంటూ సీరియస్ అయ్యారు.

Supreme Court: నీట్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ అవసరం లేదని ఆదేశాలు


విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది మేథ్యూస్ నెడుంపర హాజరయ్యారు. మరో పిటిషనర్ తరఫున హాజరైన నరేంద్ర హుడా తన వాదన వినిపిస్తుండగా నెడుంపర అడ్డుపడ్డారు. తాను సీనియర్ మోస్ట్ న్యాయవాదినని, బెంచ్ అడిగిన ప్రశ్నకు తాను జవాబిస్తానని, తాను 'అమికస్‌'నని చెప్పారు. ఇందుకు సీజేఐ ''నేను ఏ ఎమికస్‌ను నియమించలేదు" అని అన్నారు. నెడుంపర అక్కడితో ఆగకుండా..''మీరు నాకు గౌరవం ఇవ్వుకుంటే, నేను వెళ్లిపోతాను'' అన్నారు. సీజేఐ వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''మిస్టర్ నెడుంపర, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు గ్యాలరీతో మాట్లాడటం లేదు. నేను కోర్టు ఇన్‌చార్జిని. సెక్యూరిటీని పిలవండి...ఆయనను బయటకు పంపిస్తారు'' అని అన్నారు. దీనికి మళ్లీ నెడుంపర ''నేనే వెళ్లిపోతాను'' అంటూ అందుకు సిద్ధపడ్డారు. సీజేఐ తిరిగి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''నేను వెళ్లిపోతానని మీరు చెప్పకూడదు. 24 ఏళ్లుగా జ్యుడిషియరీని చూస్తున్నాను. కోర్టులో ప్రొసీడింగ్స్‌ను లాయర్లు ఎప్పడూ డిక్టేట్ చేయరు'' అని చెప్పారు. నెడియూరప్ప పట్టువీడకుండా ''1979 నుంచి నేనూ జ్యుడిషియరీని చూస్తున్నాను'' అనడంతో సీజేఐ తాను ఆదేశాలివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక లాయర్‌ మాట్లాడుతుండగా మీరు ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. దీంతో నెడియూరప్ప బయటకు వెళ్లిపోయారు. ఆ కాసేపటికే తిరిగి వెనక్కి వచ్చారు. ''సారీ.. నేను ఎలాంటి తప్పూ చేయలేదు, నన్ను అనుచితంగా ట్రీట్ చేశారు. నేను ఈ విషయం ఇంతటితో వదలిపెట్టేస్తున్నాను'' అని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 23 , 2024 | 06:21 PM