Share News

Chirag Paswan: ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నిక

ABN , Publish Date - Aug 25 , 2024 | 05:16 PM

లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఐదేళ్లు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. రాంచీలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎల్‌జేపీ (ఆర్వీ) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Chirag Paswan: ఎల్‌జేపీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా చిరాగ్ పాశ్వాన్ తిరిగి ఎన్నిక

పాట్నా: లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) తిరిగి ఎన్నికయ్యారు. దీంతో వచ్చే ఐదేళ్లు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. రాంచీలో జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చిరాగ్ పాశ్వాన్ తిరిగి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎల్‌జేపీ (ఆర్వీ) ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.


''లోక్‌ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) జాతీయ అధ్యక్షుడిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర మంత్రి, హజీపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను అభినందనలు తెలియజేస్తున్నాం'' అని ఆ ప్రకటన పేర్కొంది. పాశ్వాన్ సమర్ధ నాయకత్వంపై నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్టీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిందని, ఆయన నిర్దేశకత్వంతో పార్టీ కొత్త పుంతలు తొక్కుతుందని బలంగా నమ్ముతోందని తెలిపింది.

Mayawati on caste census: కులగణనపై కాంగ్రెస్‌కు క్లాస్..


కృతజ్ఞతలు తెలిపిన చిరాగ్

పార్టీ అధ్యక్షుడిగా తిరిగి తనను ఎన్నుకున్నందుకు కార్యకర్తలు, ఆఫీస్ బేరర్లకు చిరాగ్ పాశ్వాన్ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ విజన్‌కు అనుగుణంగా పార్టీ నిర్మాణానికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. జార్ఖాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీతో పొత్తుతో కానీ, స్వతంత్రంగా గానీ పోటీ చేస్తుందని చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 05:16 PM