CM Siddaramaiah : పన్నుల వాటాలో అన్యాయంపై కొత్త వ్యూహం
ABN , Publish Date - Sep 15 , 2024 | 03:20 AM
పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.
8 రాష్ట్రాల సీఎంలకు సిద్దరామయ్య లేఖ
బెంగళూరు, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 11న ఆయన.. అధికాదాయం ఉన్న 8 రాష్ట్రాల (ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, హరియాణ, కేరళ) సీఎంలకు లేఖలు పంపారు. వీరితో ఆర్థిక సమాఖ్య వాదంపై బెంగళూరులో ఓ సదస్సు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అధికాదాయం ఉన్న రాష్ట్రాల పన్నులను రాజకీయ లబ్ధి కోసం యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు కేంద్రం పంచుతోందని సిద్దరామయ్య గతంలోనూ విమర్శించారు. ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుల ముందు కూడా ఆయన.. కేంద్ర ఖజానాకు కర్ణాటక నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి ఇస్తోందని ఆరోపించారు.