Share News

ISRO: ఆదిత్యుడు తీసిన సూర్యుడి రంగుల ఫొటోలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:06 AM

సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది.

ISRO: ఆదిత్యుడు తీసిన సూర్యుడి రంగుల ఫొటోలు

బెంగళూరు, జూన్‌ 10: సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1లోని రెండు పరికరాలు ఉగ్ర సూరీడు చిత్రాలను బంధించాయని ఇస్రో తెలిపింది. భారత తొలి సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1ను ఇస్రో గతేడాది సెప్టెంబరు 2న ప్రయోగించింది. ఇది 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఈ ఏడాది జనవరి 6న ఎల్‌-1 పాయింట్‌కు చేరుకుంది.

భూమికి సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎల్‌-1 పాయింట్‌ నుంచి ఇది సూర్యుడిని నిత్యం పరిశీలిస్తుంది. ఈ క్రమంలో ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకలో ఏర్పాటు చేసిన సోలార్‌ ఆలా్ట్ర వైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌), విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ) ఈ ఏడాది మే నెల 8 నుంచి 15వ తేదీ మధ్య కాలంలో సూర్యుడి డైనమిక్‌ కార్యకలాపాలను చిత్రీకరించాయని ఇస్రో వెల్లడించింది. భూ అయస్కాంత తుఫానులకు దారితీసే కరోనాల్‌ మాస్‌ ఎజెక్షన్‌ (సీఎంఈ)తో సంబంధం ఉన్న అనేక ఎక్స్‌-క్లాస్‌, ఎం-క్లాస్‌ మంటలను ఈ రెండు పరికరాలు నమోదు చేశాయని తెలిపింది. మే 17న ‘సూట్‌’ పేలోడ్‌ సేకరించిన సూర్యుని చిత్రాలను ఇస్రో విడుదల చేయడంతోపాటు.. వీఈఎ్‌ససీ అందించిన పరిశీలనల వివరాలను కూడా పంచుకుంది.

Updated Date - Jun 11 , 2024 | 03:06 AM