Share News

Delhi : హిందూమహాసముద్రంలో 3 చైనా నిఘా నౌకలు

ABN , Publish Date - Aug 11 , 2024 | 05:23 AM

చైనా మళ్లీ హిందూమహాసముద్ర ప్రాంతం(ఐఓఆర్‌)లోకి నిఘా నౌకలను పంపింది. భవిష్యత్తులో చైనా జలాంతర్గములు ఐఓఆర్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన కీలక సమాచారాన్ని ఈ నిఘా నౌకలు సేకరిస్తున్నట్టు తెలిసింది.

Delhi : హిందూమహాసముద్రంలో 3 చైనా నిఘా నౌకలు

న్యూఢిల్లీ, ఆగస్టు 10: చైనా మళ్లీ హిందూమహాసముద్ర ప్రాంతం(ఐఓఆర్‌)లోకి నిఘా నౌకలను పంపింది. భవిష్యత్తులో చైనా జలాంతర్గములు ఐఓఆర్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన కీలక సమాచారాన్ని ఈ నిఘా నౌకలు సేకరిస్తున్నట్టు తెలిసింది.

జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌-03, ఝోంగ్‌ షాన్‌ డా క్సూ, యింగ్‌ వాంగ్‌-7 నౌకలు ఐఓఆర్‌లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న దృశ్యాలను డామియన్‌ సిమోన్స్‌ అనే వ్యక్తి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

భారత నావికాదళం ఆ నౌకలపై ఓ కన్నేసి ఉంచింది. ఐఓఆర్‌లోని భారత తీర ప్రాంతంతోపాటు మాల్దీవులు, శ్రీలంక వంటి పొరుగుదేశాల ఈఈజడ్‌(ప్రత్యేక ఆర్థిక జోన్‌)లలోకి చైనా తరచుగా ఈ నిఘా నౌకలను పంపుతోంది.

Updated Date - Aug 11 , 2024 | 05:23 AM