Share News

Delhi : కుమారుడు గూగుల్‌ సీఈవో అయినా..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:05 AM

సాధారణంగా ఏ దేశంలోనైనా తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. భారతీయులకైతే తమ పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో చాలా అంచనాలు ఉంటాయి.

Delhi : కుమారుడు గూగుల్‌ సీఈవో అయినా..!

  • భారతీయులకు సంతృప్తి ఉండదు

  • ఇన్‌స్టాలో సుందర్‌ పిచయ్‌ పోస్టు వైరల్‌

న్యూఢిల్లీ, జూలై 27: సాధారణంగా ఏ దేశంలోనైనా తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. భారతీయులకైతే తమ పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో చాలా అంచనాలు ఉంటాయి. ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా ఇంకో ఏదో సాధించాలని ఆశిస్తారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచయ్‌ విషయంలో ఇదే జరిగింది.

అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్‌ సీఈవోగా భారతీయుడు పిచయ్‌ కావడం దేశంలో లక్షలాది యువతకు స్ఫూర్తిదాయకం. దేశం గర్వించే స్థాయికి సుందర్‌ పిచయ్‌ ఎదిగినా ఆయన తల్లిదండ్రులకు ఇంకా ఓ కోరిక ఉండేదట.

తాను పీహెచ్‌డీ అందుకోవాలన్నది తన తల్లిదండ్రుల చిరకాల కోరికని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ మాజీ విద్యార్థి అయిన సుందర్‌ పిచయ్‌కు ఇటీవల ఆ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన చేసిన పోస్టు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

Updated Date - Jul 28 , 2024 | 06:05 AM