నింగిలోకి భారత్ తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్
ABN , Publish Date - Aug 25 , 2024 | 03:09 AM
అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. చెన్నైలోని తిరవిందాండై తీరం నుంచి తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1....
రూమీ-1 ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ, ఆగస్టు 24: అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. చెన్నైలోని తిరవిందాండై తీరం నుంచి తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ-1 (ఆర్హెచ్యూఎంఐ-1)ను శనివారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది.
తమిళనాడుకు చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ కలసి దీనిని అభివృద్ధి చేశాయి. మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన ఈ రాకెట్ 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను మోసుకెళ్లి భూ ఉపకక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ప్రయోగం తర్వాత రాకెట్ శకలాలు తిరిగి భూమికి చేరేలా పారాచూట్లను అమర్చారు. వీటిని సేకరించి మరో రాకెట్ ప్రయోగంలో వాడతారు. స్పేస్ జోన్ ఇండియా వ్యవస్థాపకుడు అనంద్ నేతృత్వంలో ఈ మిషన్ జరిగింది.