Share News

Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

ABN , Publish Date - Aug 13 , 2024 | 07:46 PM

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది.

Excise scam: కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

న్యూఢిల్లీ: ఎక్సైజ్ కుంభకోణానికి (Excise scam) సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. ఇంతకుముందు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బజ్వా ఆదేశాలు జారీ చేశారు.

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం


ఈ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇంతకుముందు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. అయితే అవరసమైన బెయిల్ బాండు సమర్పించకపోవడంతో ఆయన తీహార్ జైలులోనే కొనసాగుతున్నారు. అవినీతి ఆరోపణల కేసులో సీబీఐ విచారణలో భాగంగా కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కొనసాగుతోంది. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసే క్రమంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, లైసెన్స్ హోల్డర్లకు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చారని ఈడీ, సీబీఐ ఆరోపణలుగా ఉన్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 07:46 PM