Share News

Delhi : ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల

ABN , Publish Date - Aug 17 , 2024 | 03:42 AM

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా కార్యదర్శులను బదిలీ చేసింది. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, మైనార్టీల సంక్షేమం తదితర శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది.

Delhi : ఆర్థిక సేవల శాఖ కార్యదర్శిగా నాగరాజు మద్దిరాల

  • భారీగా కేంద్ర కార్యదర్శుల బదిలీ

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా కార్యదర్శులను బదిలీ చేసింది. ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, మైనార్టీల సంక్షేమం తదితర శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించింది.

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా పుణ్య సలిల శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆరోగ్య శాఖలో తొలుత ఆమె ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా (ఓఎ్‌సడీ) చేరనున్నారు. ప్రస్తుత కార్యదర్శి అపూర్వ చంద్ర సెప్టెంబరు 30న పదవీ విరమణ చేసిన అనంతరం పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేష్‌ కుమార్‌ సింగ్‌ నియమితులయ్యారు.

ప్రస్తుతం ఆయన డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కూడా రక్షణ శాఖలో ఓఎ్‌సడీగా చేరనున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి అరమనే గిరిధర్‌ అక్టోబరు 31న పదవీ విరమణ చేసిన అనంతరం ఆ శాఖ కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. మైనార్టీ వ్యవహారాల కార్యదర్శి కటికితల శ్రీనివాస్‌.. హౌసింగ్‌- అర్బన్‌ వ్యవహరాల కార్యదర్శిగా నియమితులయ్యారు.

బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి నాగరాజు మద్దిరాల ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి వివేక్‌ జోషి.. సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి కార్యదర్శిగా దీప్తి ఉమాశంకర్‌ బదిలీ అయ్యారు.

Updated Date - Aug 17 , 2024 | 03:42 AM