Share News

Delhi : నీట్‌-యూజీ ఫలితాల ప్రకటన

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:30 AM

వివాదాస్పదంగా మారిన నీట్‌-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు..

Delhi : నీట్‌-యూజీ ఫలితాల ప్రకటన

పాత టాపర్లలో 44 మందికి ఫుల్‌ మార్కులు

న్యూఢిల్లీ, జూలై 26: వివాదాస్పదంగా మారిన నీట్‌-యూజీ పరీక్షల తుది ఫలితాలను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం ప్రకటించింది. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఉండడంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ బిట్‌కు మార్కులు ఇచ్చినట్టు ఎన్‌టీఏ తెలిపింది. దాని ప్రకారం ర్యాంకులు రూపొందించింది. ప్రస్తుత ఫలితాల్లో 44 మంది ఫుల్‌ మార్క్స్‌ సంపాదించి టాపర్లుగా నిలిచారు. తొలుత ఫలితాలు ప్రకటించినప్పుడు మొత్తం 67 మంది టాపర్లుగా గుర్తింపు పొందారు. కొన్ని పరీక్ష కేంద్రాల్లో పేపర్లు ఇవ్వడం ఆలస్యంగా కావడంతో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఎన్‌టీఏ మొదట గ్రేస్‌ మార్కులు ఇచ్చింది. అనంతరం ఆ గ్రేస్‌ మార్కులను ఉపసంహరించుకోవడంతో ఆరుగురు విద్యార్థులు టాపర్ల అర్హతను కోల్పోయారు. దాంతో సవరించిన ఫలితాల్లో 61 మంది టాపర్లుగా నిలిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మూడోసారి ర్యాంకుల తుది జాబితాను రూపొందించగా వారిలో 44 మంది టాపర్లుగా ఘనతను పొందారు. అభ్యర్థుల ‘రీ-రివైజ్డ్‌ స్కోర్‌ కార్డులు’ సిద్ధంగా ఉన్నాయని ఎన్‌టీఏ తెలిపింది.

Updated Date - Jul 27 , 2024 | 04:31 AM