Share News

Heavy Rains: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు.. 11కి చేరిన మృతుల సంఖ్య

ABN , Publish Date - Jun 30 , 2024 | 02:35 PM

దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో నగరాన్ని వరదలు ముంచెత్తుతుండగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీంతో ప్రభుత్వం ఢిల్లీవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

Heavy Rains: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు.. 11కి చేరిన మృతుల సంఖ్య

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని గత 5 రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) వణికిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో నగరాన్ని వరదలు ముంచెత్తుతుండగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీంతో ప్రభుత్వం ఢిల్లీవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. వరదల్లో చిక్కుకుని ఇప్పటివరకు11 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అత్యధికంగా 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1936 తర్వాత జూన్‌లో అత్యధిక వర్షపాతం నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర భారత దేశంలో కూడా కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు.


పశ్చిమ యూపీ, హరియాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల ధాటికి రెండు రోజుల క్రితం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ 1 కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఇళ్లలోకి చేరుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులందరూ విధులకు హాజరుకావాలని ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరద ప్రభావిత ప్రాంతాలు, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రుతుపవనాల సమయంలో ఢిల్లీలో దాదాపు 650 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు గుర్తించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 30 , 2024 | 02:35 PM