Share News

Deputy CM: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం..

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:40 PM

క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి కార్యక్రమంగా విరుదునగర్‌ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు.

Deputy CM: క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం..

- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి

చెన్నై: క్రీడాకారుల విజ్ఞప్తి మేరకు తొలివిడతగా వంద మంది క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటి కార్యక్రమంగా విరుదునగర్‌ జిల్లాలో జరిగిన ప్రభుత్వ సంక్షేమ సహాయాల పంపిణీ కార్యక్రమంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ట్రోఫీ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన 2,111 మందికి రూ.42.96 కోట్ల విలువైన బహుమతులు అందజేశారు. ముందుగా, 255 మంది దివ్యాంగులకు రూ.45.39 కోట్ల విలులైన ఉచిత ఇళ్లపట్టాలు, మరో 20 మంది దివ్యాంగులు స్వయం ఉపాధి పొందేలా రుణసాయాన్ని ఉప ముఖ్యమంత్రి అందజేశారు.

ఇదికూడా చదవండి: వందేళ్లు పూర్తి చేసుకున్న జిమ్మీ కార్టర్‌


ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చెన్నై బయట మొదటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మదురైలో ఫిబ్రవరి జరిగిన కలైంజర్‌ క్రీడా పరికారాలు అందజేసే కార్యక్రమం ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో 18 జిల్లాల్లోని అన్ని గ్రామాలకు క్రీడా పరికరాలు అందజేశామని తెలిపారు.

చెస్‌కు గర్వకారణం రాష్ట్ర క్రీడాకారులు..

దక్షిణ జిల్లాలు అంటేనే ధైర్యసాహసాలకు పేరుతో పాటు వీర క్రీడాకారులకు కూడా ప్రసిద్ధి చెందాయన్నారు. ఎంతోమంది క్రీడాకారులను తయారుచేసిన జిల్లాలు కాగా, మరెందరో ఈ జిల్లాల నుంచి వస్తున్నార అన్నారు.


చెస్‌లో రాష్ట్రానికి చెందిన గుహేష్‌, ప్రజ్ఞానంద, వైష్ణవి, శ్రీనాధ్‌ అంతర్జాతీయంగా రాణిస్తూ రాష్ట్రానికి మంచి గుర్తిపు, గౌరవం, కీర్తి తెస్తున్నారని అభినందించారు. మూడేళ్లలో 1,300 మంది క్రీడాకారులకు రూ.38 కోట్లను ప్రోత్సాహక నిధిగా ముఖ్యమంత్రి అందజేశారని తెలిపారు. అలాగే, క్రీడాకారుల కోరిక మేరకు 100 మంది క్రీడాకారులకు త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు అందించనున్నామన్నారు. ఖేలో ఇండియా, కార్‌ రేస్‌ తదితరాలను రాష్ట్రప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌, ఆర్ధిక శాఖ మంత్రి తంగం తెన్నరసు, వాణిజ్య శాఖ మంత్రి మూర్తి, విరుదునగర్‌ కలెక్టర్‌ జయశీలన్‌, అదనపు ప్రధాన కార్యదర్శి అతుల్య మిశ్ర, మేఘనాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


..............................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................

Chennai: గాంధీ మండపంలో బ్రాందీ సీసాలా?

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) దేశవ్యాప్తంగా ప్రారంభించిన ‘స్వచ్ఛతా హీ సేవా 2024’ పిలుపుమేరకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు చేరువలో ఉన్న గాంధీ మండప ప్రాంతాన్ని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సేవా సంఘాల కార్యకర్తలతో కలిసి శుభ్రం చేశారు. గవర్నర్‌ సుమారు గంటసేపు ఆ ప్రాంతంలో చెత తొలగించారు. ఆ సందర్భంగా ఓ చోట పడి ఉన్న మద్యం సీసాలు చూసి దిగ్ర్భాంతి చెందారు.

nani1.jpg


అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదని, ఆయన పరిశుభ్రత ప్రాధాన్యత లోకానికి చాటిన మహానాయకుడన్నారు. తాను గాంధీ మండపంలో పరిసరాలను శుభ్రం చేస్తుండగా కొన్ని ఖాళీ మద్యం సీసాలు పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందానని తెలిపారు. ఇలా పవిత్రమైన గాంధీ మండప ప్రాంగణాన్ని కళంకపరిచేలా దుండగులెవరో మద్యం సీసాలు పారవేసి వెళ్లడం గర్హనీయమని అన్నారు.


ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

ఇదికూడా చదవండి: రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2024 | 12:40 PM