Share News

డిజిటల్‌ అరెస్టు ఉత్తదే!

ABN , Publish Date - Oct 07 , 2024 | 04:07 AM

సీబీఐ, పోలీసులు, కస్టమ్స్‌ విభాగం, ఈడీ లేదా జడ్జిలు వీడియో కాల్‌ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని భారత సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ స్పష్టం చేసింది.

డిజిటల్‌ అరెస్టు ఉత్తదే!

  • వీడియో కాల్‌తో సీబీఐ, ఈడీ, పోలీసులు అరెస్టు చేయరు

  • ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ స్పష్టం

న్యూఢిల్లీ, అక్టోబరు 6 : సీబీఐ, పోలీసులు, కస్టమ్స్‌ విభాగం, ఈడీ లేదా జడ్జిలు వీడియో కాల్‌ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని భారత సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ స్పష్టం చేసింది. డిజిటల్‌ అరెస్టు పేరిట దేశంలో పెరిగిపోతోన్న మోసాలను దృష్టిలో ఉంచుకుని ఈమేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ శనివారం వివరణ జారీ చేసింది. డిజిటల్‌ అరెస్టు అనేది మోసం అని తెలిపింది. వాట్సాప్‌, స్కైప్‌ వంటి వీడియో కాల్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది.

వీటిపై ప్రజలు సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కి లేదా www.cyber-crime.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ తెలియజేసింది. మోసగాళ్లు బాధితులకు ఎస్‌ఎమ్మెఎస్‌ పంపడం లేదా వీడియో కాల్‌ చేయడం ద్వారా తాము ఫలానా ప్రభుత్వ ఏజెన్సీ అధికారులమని నమ్మిస్తున్నారు. తర్వాత ఆ వ్యక్తి లేదా అతని కుటుంబసభ్యులను డ్రగ్స్‌ లేదా మనీ లాండరింగ్‌ వంటి నేరాల్లో పట్టుకున్నట్లు చెప్పి డిజిటల్‌ అరెస్టు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆన్‌లైన్‌లో డబ్బు పంపించమని కోరుతున్నారు.

Updated Date - Oct 07 , 2024 | 04:08 AM