Share News

Agnipath Scheme: 'కార్గిల్ దివస్'లోనూ అబద్ధాలు మానరా? మోదీకి ఖర్గే కౌంటర్

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:21 PM

సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.

Agnipath Scheme: 'కార్గిల్ దివస్'లోనూ అబద్ధాలు మానరా? మోదీకి ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: సైన్యంలో సంస్కరణల కోసం అగ్నిపథ్ పథకం (Agnipath Scheme) తీసుకువచ్చామని, విపక్షాలు మాత్రం ఈ పథకంపై యువతను తప్పుదారి పట్టించేలా విమర్శలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'కార్గిల్' దివస్ (Kargil Diwas) సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తిప్పికొట్టారు. మోదీ ఆబద్ధాలు వ్యాప్తి చేస్తూ, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు.


"కార్గిల్ అమరవీరులకు ఘననివాళులు అర్పించే సందర్భంలో కూడా దిగజారుడు రాజకీయాలకు ప్రధాని పాల్పడటం విచారకరం. ఏ ప్రధానమంత్రి గతంలో ఇలాగ ప్రవర్తించినది లేదు. ఆర్మీ తరఫున అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు మోదీ చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. మన సాహస సాయుధ జవాన్లను అవమానించడమే'' అని ఖర్గే సామాజిక మాధ్యమంలో 'ఎక్స్'లో విమర్శించారు.


ఆర్మీ మాజీ చీఫ్ (రిటైర్డ్) జనరల్ ఎంఎం నరవణే చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం చేస్తోందని, త్రివిధ దళాల్లోనూ బలవంతంగా రిక్రూట్‌మెంట్ అమలు చేస్తోందని గతంలో నరవణే చెప్పిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు. అగ్నిపథ్ పథకంలో 75 శాతం రిక్రూట్‌మెంట్లు పెర్మనెంట్ బేసిస్‌లో తీసుకోవాలని, 25 శాతం మందిని 4 ఏళ్ల తర్వాత రిలీవ్ చేయాలని నరవణే స్వయంగా చెప్పినప్పటికీ అందుకు భిన్నంగా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. బలవంతంగా మూడు త్రివిధ దళాల్లో ఈ పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. సైన్యం, నావికాదళం, వైమానిక దళాలని అగ్నిపథ్ పథకం ఒక షాకింగ్ అని నరవణే తన పుస్తకంలో కూడా ప్రస్తవించారని చెప్పారు. రిటైర్డ్ అధికారులు సైతం అగ్నిపథ్ పథకాన్ని విమర్శించారని, ఇది జాతీయ భద్రతకు ప్రమాదకరమని హెచ్చరించారని ఖర్గే వివరించారు.

Kargil Vijay Diwas 2024: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు.. తిప్పికొట్టిన ప్రధాని మోదీ.. పథకం ఉద్దేశం ఇది..


''అగ్నివీరులకు ఎలాంటి పెన్షన్ ఉండదు. గ్రాట్యుటీ లేదు. ఫ్యా్మిలీ పెన్షన్ లేదు, లిబరలైజ్డ్ ఫ్యామిలీ ఫెన్షన్ లేదు. వారి పిల్లలకు ఎలాంటి ఎడ్యుకేషన్ అలవెన్సులు లేవు. 15 15 మంది అగ్నివీరులు ఇంతవరకూ అమరులయ్యారు. కనీసం వారి బలిదానాలనైనా గౌరవించండి'' అని ఖర్గే ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 04:21 PM