Share News

Donkey milk: గాడిద పాల కేంద్రం సీజ్‌..

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:52 PM

రైతులకు గాడిదలు సరఫరా చేసి వాటినుంచి సేకరించిన పాలను విక్రయించడానికి ఏర్పాటు చేసిన ‘జెన్ని మిల్క్‌’ స్టార్ట్‌ అప్‌ కంపెనీని అధికారులు సీజ్‌ చేశారు. విజయనగర(Vijayanagara) జిల్లా కేంద్రమైన హొసపేటలో ఏర్పాటయిన ఈ కేంద్రాన్ని నగరసభ కమిషనర్‌ చంద్రప్ప, నగరాభివృద్ధి యోజనా డైరెక్టర్‌ మనోహర్‌, పరిశీలించారు.

Donkey milk: గాడిద పాల కేంద్రం సీజ్‌..

- అనుమతులు లేకుండా వ్యాపారం చట్ట విరుద్ధం: హొసపేట నగరసభ కమిషనర్‌ చంద్రప్ప

బళ్లారి(బెంగళూరు): రైతులకు గాడిదలు సరఫరా చేసి వాటినుంచి సేకరించిన పాలను విక్రయించడానికి ఏర్పాటు చేసిన ‘జెన్ని మిల్క్‌’ స్టార్ట్‌ అప్‌ కంపెనీని అధికారులు సీజ్‌ చేశారు. విజయనగర(Vijayanagara) జిల్లా కేంద్రమైన హొసపేటలో ఏర్పాటయిన ఈ కేంద్రాన్ని నగరసభ కమిషనర్‌ చంద్రప్ప, నగరాభివృద్ధి యోజనా డైరెక్టర్‌ మనోహర్‌, పరిశీలించారు. ఈ వ్యాపారానికి అనుమతులు లేవని, అప్పటి వరకు కేంద్రాన్ని తెరవరాదని సూచించారు. ఈ సందర్భంగా నగరసభ కమిషనర్‌ చంద్రప్ప(City Council Commissioner Chandrappa) మీడియాతో మాట్లాడుతూ ఈ కంపెనీ స్థానికంగా వ్యాపారం చేయడానికి అవసరమైన అనుమతులు పొందలేదని తెలిపారు.

ఇదికూడా చదవండి: RG Kar case: సీఎం మమత అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే..


గాడిద పాలు సామాజికంగా ఉపయోగించే పాలు కాదని, అందుచేత సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు పొందిన తరువాతనే నగరసభ అనుమతి ఇస్తుందని వివరించారు. అప్పటి వరకు కార్యాలయంలో ఎలాంటి వ్యవహారాలు జరపరాదని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. గాడిద పాలు పుష్టిదాయకం, శక్తిదాయకం చెప్పుకోవచ్చునని, అయితే అందుకు సరైన ఆధారాలు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. కంపెనీ వలన మోసపోయినట్లు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందక పోయినా... ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.


pandu1.jpg

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం జెర్సీమిల్క్‌ కంపెనీ రాష్ట్రంలో 200కి పైగా రైతులకు 600కు పైగా గాడిదలను అందజేసినట్లు తెలుస్తోందన్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని అనంతపురం నగరంలో ఉన్నట్లు, అక్కడ గాడిద పాలశుద్దీకరణ కేంద్రం స్థాపించినట్లు సమాచారం ఉందన్నారు. ప్రస్తుతం హొసపేట నగరంలో ఏర్పాటు చేసిన వ్యాపారకేంద్రాన్ని మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: తుపాకీరాముడిని మరిపిస్తున్న కౌశిక్‌రెడ్డి: మల్లు రవి

ఇదికూడా చదవండి: ప్రతి నియోజకవర్గానికీ ఎంఎస్ఎంఈ పార్కు

ఇదికూడా చదవండి: రాసిపెట్టుకో.. రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం

Read LatestTelangana News andNational News

Updated Date - Sep 18 , 2024 | 12:52 PM