Share News

Viral Video: నోరు పారేసుకోవద్దు.. లాయర్‌ను తీవ్రంగా మందలించిన సీజేఐ

ABN , Publish Date - Mar 18 , 2024 | 08:43 PM

ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై సోమవారంనాడు విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహానికి గురయ్యారు. ''నాపై అరవొద్దు'' అంటూ ఒక లాయర్‌ను మందలించారు. రద్దయిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral Video: నోరు పారేసుకోవద్దు.. లాయర్‌ను తీవ్రంగా మందలించిన సీజేఐ

న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ (Electoral bonds) కేసుపై సోమవారంనాడు విచారణ సందర్భంగా సీజేఐ (CJI) డీవై చంద్రచూడ్ (DY Chandrachud) ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ''నాపై అరవొద్దు'' (Don't shout at me) అంటూ ఒక లాయర్‌ను మందలించారు. రద్దయిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గొంతు పెంచి మాట్లాడొద్దంటూ సీజేఐ మందలిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.


''డోంట్ షౌట్ ఎట్ మీ. ఇదేమీ హైడ్ పార్క్ కార్నర్ సమావేశం కాదు. మీరు కోర్టులో ఉన్నారు. మీరు ఏదైనా అప్లికేషన్ మూవ్ చేయాలనుకుంటే ముందుగా అప్లికేషన్ ఫైల్ చేయండి. సీజీఐగా నా మాట వినాలి, మేము మీ మాట వినడం కాదు. మీరైదైనా అప్లికేషన్ ఫైల్ చేయాలని అనుకుంటే ఈ-మెయిల్ పంపండి. ఈ కోర్టులో ఇదే రూల్'' అని సీజేఐ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


లాయర్ వాదన ఇలా సాగింది..

ప్రజలకు ఏమాత్రం తెలియకుండానే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని, ఇదెంత మాత్రం సమర్ధనీయం కాదని అడ్వకేట్ మేథ్యూస్ నేదుమ్పారా వాదించారు. ''ఇది విధానపరమైన నిర్ణయం. కోర్టుకు జోక్యం చేసుకోరాదు. ఆ కారణంగానే తీర్పు తమకు తెలియకుండా వచ్చిందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు'' అని అన్నారు. దీంతో అక్కడకు వాదన ఆపాలని, తమ మాట వినాలని సీజేఐ ఆయనకు పదేపదే సూచించారు. అయినప్పటికీ తన వాదన వినాలంటూ న్యాయవాది పట్టుబట్టారు. ఈ దశలో జస్టిస్ గవయీ జోక్యం చేసుకుంటూ ''న్యాయపాలన ప్రక్రియను మీరు అడ్డుకుంటున్నారు. కోర్టు ధిక్కార నోటీసును మీరు కోరుకుంటున్నారా?'' అని గట్టిగా మందలించారు. దీంతో అడ్వకేట్ మేథ్యూస్ నేదుమ్పారా వెనక్కి తగ్గారు.

Updated Date - Mar 19 , 2024 | 02:23 PM