Share News

Election Commission : పోలింగ్‌ శాతంపై దుష్ప్రచారం

ABN , Publish Date - Aug 05 , 2024 | 02:58 AM

పోలింగ్‌ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.

Election Commission : పోలింగ్‌ శాతంపై దుష్ప్రచారం

  • ఎన్నికల ప్రక్రియకు అప్రతిష్ఠ తెచ్చేందుకే...

  • ఎలాంటి తేడాలు లేవు .. ఎలక్షన్‌ కమిషన్‌ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 4: పోలింగ్‌ శాతాల్లో భారీగా తేడాలు ఉన్నాయంటూ వస్తున్న విశ్లేషణలను ఆదివారం ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే ప్రకటించిన ఓట్ల శాతానికి, తుది ఓట్ల శాతానికి మధ్య మరీ ఎక్కువగా తేడా ఉందంటూ విశ్లేషణలు వచ్చాయి.

అయితే ఇది తప్పుడు ప్రచారమని, ఎన్నికల ప్రక్రియకు అప్రతిష్ఠ కలిగించేందుకు జరుగుతున్న ప్రయత్నమని ఆరోపించింది. ఓట్ల శాతంలో భారీగా తేడాలు ఉన్నట్టు ఓట్‌ ఫర్‌ డెమొక్రసీ అనే సంస్థ తన విశ్లేషణలో గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ తేడా అధికంగా ఉన్నట్టు తెలిపింది. తొలుత ప్రకటించిన పోలింగ్‌ శాతం కన్నా తుది పోలింగ్‌ శాతం బాగా ఎక్కువగా ఉందని పేర్కొంది.

దీనిపై స్పందించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘాన్ని డిమాండు చేసింది. దాంతో ఎన్నికల సంఘం ఎక్స్‌ ద్వారా సమాఽధానాలు ఇచ్చింది. చాలా పోలింగ్‌ స్టేషన్ల వద్ద సాయంత్రం ఏడు గంటల తరువాత కూడా ఓటర్లు లైనుల్లో నిల్చొని ఉన్నారని తెలిపింది.

అందువల్ల వాటి పోలింగ్‌ సమాచారం మరుసటి రోజునే తెలిసిందని పేర్కొంది. ఆ కారణంగానే ప్రాథమిక ఓటింగ్‌ శాతానికి, తుది శాతానికి మధ్య తేడా కనిపించిందని వివరించింది. నిబంధనలను కచ్చితంగా పాటించి పోలింగ్‌ శాతాన్ని నమోదు చేసినట్టు పేర్కొంది. పోలింగ్‌ శాతంపై అభ్యర్థులెవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపింది. వివిధ కారణాలను పేర్కొంటూ 2019లో 138 ఎన్నికల ఫిర్యాదులు రాగా ప్రస్తుతం వాటి సంఖ్య 79కి తగ్గిందని వివరించింది.

Updated Date - Aug 05 , 2024 | 02:58 AM