Share News

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

ABN , Publish Date - Aug 31 , 2024 | 05:18 AM

కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఈపీఎస్‌-95 నేషనల్‌ యాజిటేషన్‌ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది.

NAC : కనీస పెన్షన్‌ రూ.7,500 చేయండి

  • ఆర్థిక మంత్రికి పెన్షనర్ల సంఘం వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఈపీఎస్‌-95 నేషనల్‌ యాజిటేషన్‌ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను విజ్ఞప్తి చేసింది. ఈ సంఘం 78 లక్షల మంది పెన్షనర్లకు, పరిశ్రమల్లో పనిచేస్తున్న 7.5 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ సంఘం ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి సమస్యలను వివరించారు. ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తోందని, సమస్యకు పరిష్కారాన్ని అన్వేషిస్తుందని ఆమె వారికి హామీ ఇచ్చారు. పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత నెలలో ఈ సంఘం ప్రతినిధులు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయాను కలిసి ఇదే సమస్యపై వినతి పత్రం సమర్పించారు.

Updated Date - Aug 31 , 2024 | 05:18 AM