Share News

Jai Shankar: పాకిస్థాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసింది

ABN , Publish Date - Aug 30 , 2024 | 02:55 PM

సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇస్లామాబాద్‌ ఆహ్వానించిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో నిరంతర చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు.

Jai Shankar: పాకిస్థాన్‌తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసింది

న్యూఢిల్లీ: సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశానికి హాజరుకావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇస్లామాబాద్‌ ఆహ్వానించిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jai Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో నిరంతర చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. పాక్ ఎలా వ్యవహరిస్తే అందుకు తగిన విధంగా భారత్ సైతం బదులు ఇస్తుందని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అధికరణ రద్దు ఒక ముగిసిన కథ అని అన్నారు.

West Bengal: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ కీలక భేటీ.. బెంగాల్‌పై నివేదిక


బంగ్లా, మాల్దీవులతో సవాళ్లపై..

పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మాల్దీవులతో మారుతున్న సంబంధాలపై మాట్లాడుతూ, ప్రపంచంలోని ఏ దేశాన్ని చూసినా పొరుగుదేశాలతో చిక్కుముడులు కనిపిస్తాయని, పొరుగుదేశాలతో సమస్యలు లేని దేశమంటూ ఏదీ కనిపించదని అన్నారు. ఇది పొరుగుదేశాల సహజ స్వభామని అన్నారు. పరస్పర సహాయ, సహకారాలు అందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారుతో ప్రధాన మంత్రి మోదీ ఇటీవల మాట్లాడారని, అక్కడి హిందువులు, మైనారిటీలకు భద్రతకు యూనస్ హామీ ఇచ్చారని జైశంకర్ చెప్పారు. మాల్దీవులు అధ్యక్షుడు మొహహ్మద్ మయిజ్జు హయాంలో మాల్దీవులతో సంబంధాల గురించి మాట్లాడుతూ, వారి విధానంలో నిలకడ లేకపోవడం, ఒడిదుడుకులు వంటివి ఉన్నా ఆ దేశంతో ఇండియా లోతైన సంబంధాలు కొనసాగిస్తుందన్నారు. చైనా అనుకూలవాదిగా మయిజ్జుకు పేరుడంతో ఇటీవల కాలంలో ఇండియా-మాల్దీవుల మధ్య సంబంధాల్లో ఒకింత ఇబ్బందులు తలెత్తాయి. అయితే, భారత్ తమకు అత్యంత కీలక భాగస్వామి అని ఇటీవల జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా మయిజ్జు స్పష్టం చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 30 , 2024 | 02:57 PM